తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-ten-news-till-now
టాప్​టెన్​ న్యూస్ @9AM

By

Published : Jun 28, 2020, 8:57 AM IST

పీవీ శతజయంత్యుత్సవాలు ప్రారంభించనున్న కేసీఆర్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పీవీ సేవలు అందరికీ తెలిపేలా ఏడాది పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ భూమి పుత్రుడికి కేటీఆర్ ఘన నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. తెలంగాణ భూమి పుత్రుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు సేవలను కొనియాడుతూ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతడి కోసం మావో అగ్రనేతల కసరత్తు..

దండకారణ్యం కార్యదర్శి ఎంపికకు మావోలు చర్చలు ప్రారంభించారు. బస్తర్‌ అడవుల్లో ఇప్పటికే మూడు రోజులు విస్తృత సమావేశాలు నిర్వహించారు. ఎవరిని ఎంపిక చేయాలనే నిర్ణయంపై సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోసాల్లో ఘనుడు... భార్య చేతిలో హతమయ్యాడు

మేడ్చల్​ జిల్లా మౌలాలీ గాంధీనగర్​లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మెలంగి ప్రభాకరన్​ హత్య కేసులు పోలీసుల ఛేదించారు. అతని భార్యే హత్యచేసినట్లు తేల్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాదీలను వణికిస్తున్న కరోనా

భాగ్యనగరాన్ని కరోనా వణికిస్తోంది. శనివారం రికార్డు స్థాయిలో 888 కేసులు నమోదు కావడం వల్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీల్లో కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత యవనికపై చెరిగిపోని సంతకం 'పీవీ'

చరిత్రలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగి ఆరిపోయేవాళ్లు కొందరు! జీవించి ఉన్నా, లేకున్నా శాశ్వతంగా చరిత్రలో నిలిచి తరతరాలకు తమ వైభవదీప్తులు వెదజల్లే వారు, మార్గ నిర్దేశం చేసేవారు ఇంకొందరు. రెండవ కోవలోనే ప్రముఖంగా కనిపిస్తారు.. తెలుగుఠీవీ.. మాజీ ప్రధాని దివంగత పీవీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదేళ్ల సూర్యగమనం గంటలో చూస్తే.. అద్భుతం!

గత పదేళ్లలో సూర్యుడి తీరుతెన్నులను గుదిగుచ్చి ఒక గంట వీడియోను రూపొందించింది అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా). సౌర గోళాన్ని నిరంతరం గమనించే సోలార్​ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్​డీఓ) అనే ఉపగ్రహం అందించిన చిత్రాల ఆధారంగా ఈ అద్భుత టైమ్ ల్యాప్స్ వీడియోను రూపొందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

21 రోజుల తర్వాత 'పెట్రో' బాదుడుకు బ్రేక్​

వాహనదారులకు కాస్త ఉపశనమనం లభించింది. పెట్రో ధరల పెంపునకు 21 రోజుల తర్వాత బ్రేక్​ ఇచ్చాయి చమురు సంస్థలు. శనివారం లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​ పై 21 పైసలు పెంచగా.. ఆదివారం స్థిరంగా ఉంచాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ద్రవిడ్​ ముందుచూపునకు ఆశ్చర్యపోయిన రైనా

రాహుల్​ ద్రవిడ్​లోనూ మంచి కెప్టెన్​ ఉన్నాడని టీమ్​ఇండియా క్రికెటర్​ సురేశ్​ రైనా తెలిపాడు. ఆటను అర్థం చేసుకోవడంలో ద్రవిడ్​ చాలా చురుగ్గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బరువు తగ్గేందుకు పాయల్ చిట్కాలు

లాక్​డౌన్​లో ఇంటిపట్టునే ఉండి బరువు పెరిగామని బాధపడుతున్న వారి కోసం నటి పాయల్ రాజ్​పుత్ చిట్కాలు చెప్పింది. తన సలహాలు పాటిస్తే సులభంగా తగ్గుతారని తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details