తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @9AM - top ten news

ఇప్పటి వరకు ప్రధానవార్తలు

top ten news till now
టాప్​టెన్ న్యూస్​ @9AM

By

Published : Jun 17, 2020, 9:05 AM IST

కర్నల్​​ అంత్యక్రియలు అక్కడే..

చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడయ్యారు. ఆయన స్వస్థలమైన సూర్యాపేటలోనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు..

ఇలా జరగడం ఇదే తొలిసారి

రాష్ట్రానికి చెందిన అనేకమంది సైనికాధికారులు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయారు. అయితే కర్నల్​‌స్థాయి అధికారి చనిపోవడం మాత్రం ఇదే ప్రథమం.

ఆ రాత్రి ఏం జరిగింది?

భారత్​ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన హింసకు దారితీసింది. గాల్వన్ లోయలో జరిగిన బాహాబాహీలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ హింసకు కారణమేంటి? ఆ రాత్రి ఏం జరిగింది?

వివాదాస్పద ప్రాంతాలివే

దశాబ్దాలుగా భారత్​ సరిహద్దులోని అనేక ప్రాంతాలను చైనా తనవిగా చెబుతూ ఆక్రమణలకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తూ ఒప్పందాలకు తూట్లు పొడుస్తోంది. ఇప్పటికే అక్సాయిచిన్​లో పాగా వేసింది. అరుణాచల్​ ప్రదేశ్​తో పాటు చాలా ప్రాంతాలపై వివాదాన్ని సృష్టిస్తోంది. మరిన్ని వివాదాస్పదప్రాంతాలు ఏంటంటే..?

రంగంలోకి సైనిక ఉన్నతాధికారులు

భారత్​- చైనా మధ్య మే మొదటివారంలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల సైనికాధికారుల స్థాయిలో మొదటి దఫా చర్చలు జరిగాయి. మంగళవారం ఘర్షణతో సరిహద్దుల్లో పరిస్థితులు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటే..?

చైనా వ్యూహాలివే!

ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ క్రమంలో 45 ఏళ్ల తర్వాత తొలిసారి తూర్పు సరిహద్దులో హింస చెలరేగింది. హఠాత్తుగా ప్రతిష్టంభనకు దారితీసిన పరిణామాలు ఏంటో చూద్దాం..

'నిశితంగా పరిశీలిస్తున్నాం'

భారత్​-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది అగ్రరాజ్యం. లద్ధాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన జవాన్లకు సంతాపం తెలిపింది. ఇంకేమన్నదంటే..?

'సంయమనం పాటించాలి'

భారత్​, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటన, పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది.

'అతనిపై ఆధారపడలేదు'

మహేంద్ర సింగ్ ధోనీ మీద తాను ఆధారపడ్డానంటూ వస్తోన్న వార్తలను ఖండించాడు టీమ్​ఇండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​. తానెప్పుడూ మహీపై ఆధారపడలేదని స్పష్టం చేశాడు. ధోనీ మార్గనిర్దేశం మాత్రమే చేశాడని తెలిపాడు. ఇంకేమన్నాడంటే.

కొత్త హంగులతో

టాలీవుడ్​లో ఓ సినిమా భారీ స్థాయిలో హిట్​ అయితే దానికి సీక్వెల్​ చిత్రాలు తెరకెక్కించడం ప్రస్తుతం ట్రెండ్​గా మారింది. అయితే ఈ సీక్వెల్​లో కొనసాగింపు కథ కాకుండా.. కొత్త కథ(ఫ్రాంచైజీ)లతో ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు దర్శకులు. మరి త్వరలో రాబోయే ఆ కొనసాగింపు చిత్రాలేంటో తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details