పిల్లలను చెరువులో తోసేసిన తల్లి
సూర్యాపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను కర్కశంగా చెరువులోకి తోసేసింది. ఘటనలో కుమారుడి మృతదేహం లభ్యం కాగా... కుమార్తె కోసం గాలిస్తున్నారు. అసలు కారణమేంటి?
50 వేల మందికి కరోనా పరీక్షలు..
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వారం, పది రోజుల్లో.. 5 జిల్లాల పరిధిలో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని.. సీఎం కేసీఆర్ ఆదేశించారు.మరిన్ని వివరాలు...
గవర్నర్ దృశ్య మాధ్యమ సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృశ్య మాధ్యమ సమావేశం జరపనున్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య నిపుణులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. వేటిపై చర్చించనున్నారంటే..?
జేసీ కుటుంబానికి లోకేశ్ పరామర్శ
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురానికి బయలుదేరారు.
ఆస్పత్రి వార్డులోకి వర్షపు నీరు
మహారాష్ట్ర జల్గావ్లోని డాక్టర్ ఉల్హాస్ పాటిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వర్షపునీటితో నిండిపోయింది. నీరు మోకాళ్ల లోతుకు చేరింది. ఆ సమయంలోరోగులను ఏం చేశారంటే?