మినహాయింపు వీటికే.!
వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఫార్మా, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ పంపులు, శీతల గిడ్డంగులు, మీడియాకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణకు సడలింపులు ఉండనున్నాయి. 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో 4801 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా మరో 4801 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 32 మంది మరణించారు. 7403 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 60,136 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' ఆ సమయంలో తెరిచే ఉంటాయి'
లాక్ డౌన్ విధించినా ఉదయం 6 నుంచి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరోసారి భేటీ
ఈనెల 20న మరోమారు మంత్రివర్గ సమావేశం కానుంది. లాక్‌డౌన్ కొనసాగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. యుద్ధప్రాతిపదికన టీకాలు సమకూర్చుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!
సంపూర్ణ లాక్‌డౌన్ విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్డౌన్లు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.