తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9 PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till 9 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 9 PM

By

Published : May 13, 2021, 9:00 PM IST

మరో 4,693 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,693 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్‌ బారినపడి మరో 33 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2,867కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మే 31 వరకూ వారికే వ్యాక్సిన్‌

రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్‌ డోస్‌ వారికే వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇప్పట్లో ఉండవు

కరోనా ఉద్ధృతి తగ్గేవరకు ఎలాంటి ఎన్నికలు ఉండబోవని సీఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వచ్చే నెల 3తో ముగియనున్న శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన మండలి సభ్యుల భర్తీ కోసం ప్రభుత్వం లేఖ రాయగా... ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ కష్టమని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

దేశంలో గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటులో తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రిలిమ్స్​ వాయిదా- కొత్త తేదీ ఇదే.. !

కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్​సీ వాయిదా వేసింది. జూన్​ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్​ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్​సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి రేషన్ ఇవ్వండి

లాక్​డౌన్​ కారణంగా నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికుల కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో సామాజిక వంటశాలలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రవాణా సౌకర్యాలను కల్పించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేపే నగదు జమ!

పీఎం కిసాన్​ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19వేల కోట్లు అందనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్షయ తృతీయలో బంగారం కొనండిలా.!

సాధారణంగా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలా మంది పసిడి కొనుగోళ్లకు ఎగబడతారు. అయితే కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఈసారి నేరుగా దుకాణాల్లో బంగారం కొనడం కష్టం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ పర్వ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఉన్న అవకాశాలేమిటో తెలుసుకుందాం. . పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అలా కోచ్‌లను తీసేయగలరా?'

వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించి తుదిజట్టులోనూ చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసిందని అన్నాడు భారత దిగ్గజం సునీల్​ గావస్కర్​. సీజన్‌ మధ్యలోనే కెప్టెన్‌ను మార్చినట్టు కోచ్‌లతోనూ వ్యవహరించగలరా అని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'విరాటపర్వం' ఓటీటీలోనా?

కొవిడ్​ కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల విడుదలకు సిద్ధమైన కొన్ని తెలుగు సినిమాలు.. ఓటీటీ వైపు చూస్తున్నాయి. అందులో విరాటపర్వం కూడా ఉందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details