1. ఆగిన ఊపిరి
హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి చెందారు. దాదాపు 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ఐదువేల లోపే
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విచారణ ముమ్మరం
వామనరావు దంపుతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రామగుండం కమిషనరేట్‌లో నిన్నంతా... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధును ప్రశ్నించిన పోలీసులు... ఈరోజు ఆయన సతీమణితో పాటు పూదరి సత్యనారాయణను కూడా విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అవీ పాటిస్తే ముప్పు తక్కువే
దేశంలో ఓ వైపు కరోనా రెండో దశ విజృంభిస్తోన్న తరుణంలో.. మూడో దశ అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే తగిన నిబంధనలు పాటిస్తూ.. ఎక్కువ మంది జనాభాకు టీకాలు వేస్తే భవిష్యత్‌లో వచ్చే కరోనా తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పోలీసుల 'ఫ్లాష్‌మాబ్'
చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు.. ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. వైరస్ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అలాగే అర్హులైనవారు టీకా తీసుకోవడం, సరిగ్గా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా సబ్బుతో తరచు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తల గురించి ప్రదర్శన చేస్తూ వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.