హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంపు
రాష్ట్రంలో హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టయిఫండ్‌ను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరోసారి విమర్శలు.!
మాజీ మంత్రి ఈటల, మంత్రి గంగుల మరోసారి పరస్పర విమర్శలకు దిగారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించగా.. ఈటల బెదిరింపులకు భయపడే వారెవరూ లేరంటూ గంగుల దీటుగా సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మహా'లో 11మంది బలి
తౌక్టే తుపాను మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. 12వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 15వేల మందిని పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'టీకాల సరఫరాకు నిరంతర ప్రయత్నాలు'
కరోనా టీకాల సరఫరా పెంచేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. టీకా పంపిణీపై 15 రోజుల షెడ్యూల్‌ను రాష్ట్రాలకు ముందుగానే అందించనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో జిల్లా స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్లాక్ ఫంగస్‌పై మార్గదర్శకాలు!
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యాధి చికిత్సకు ఎయిమ్స్ మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, మధుమేహంతో బాధపడుతున్న వారికే ఈ వ్యాధి వస్తున్నట్లు కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.