డిసెంబర్ నాటికి 259 కోట్లకు పైగా డోసులు
డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్‌కైనా భారత్‌లో అనుమతివ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే మన దేశం మూడో స్థానంలో ఉందని, సెప్టెంబర్ వరకు మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కింద కోర్టుకు వెళ్లండి.!
రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. కింది కోర్టుకు వెళ్లాలని రఘురామకు కోర్టు సూచించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింది కోర్టును సంప్రదించాలని ఆదేశించింది. సీఐడీ కోర్టులో రఘురామకృష్ణరాజును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం
హైదరాబాద్ మల్లాపూర్‌లో అంబులెన్స్‌లో మృతి చెందిన గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతిపై వివరాలు సేకరిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' మోదీజీ.. మీ వల్లే '
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు నదిని విలపించేలా చేస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ రాష్ట్రాల్లో 67శాతం పూర్తి
10 రాష్ట్రాల్లో 67 శాతం మందికి టీకాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈమేరకు వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. 60ఏళ్ల పైబడిన వారిలో 39.9 శాతం మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపటి నుంచి సంపూర్ణ లాక్డౌన్
బంగాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే 16 నుంచి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9 నదులు.. 99కాలువలు.!
సిటీ ఆఫ్ లేక్స్‌గా ప్రఖ్యాతి గాంచిన ఉదయపుర్‌లో ధేబర్ సరస్సు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జైసమంద్గా కూడా పిలిచే ఈ సరస్సు ప్రపంచంలో రెండో అతిపెద్ద పురాతన కృత్రిమ సరస్సుగా గుర్తింపు దక్కించుకుంది. తొమ్మిది నదులు, 99 కాలువల కలయికతో ఈ సరస్సు రూపుదిద్దుకుందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
భారత్‌కు భారీ విరాళం
కరోనా పోరులో భారత్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు రష్యాకు చెెందిన విటలిక్ బుటేరియన్. ఆయన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం సహ వ్యవస్థాపకుడు. ఈ విరాళం విలువ సుమారు 1.14 బిలియన్ డాలర్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడుసార్లు వస్తేనే ఇంగ్లాండ్‌కు..!
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్ల కోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్రికెటర్లు ముంబయికి చేరుకోవడానికి ముందే వారి ఇళ్ల వద్ద మూడు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్ నివేదిక వస్తేనే ముంబయిలో క్వారంటైన్‌కు అనుమతిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అనుపమ క్యూట్ .. యాషిక హాట్ !
సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా నేడు కొందరు హీరోయిన్లు వారి చిత్రాలను పోస్ట్ చేశారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.