సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా
కరోనా విజృంభణ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధం'
సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్షప్రసారానికి తాను సిద్ధమని సీజేఐ ఎన్.వి.రమణ తెలిపారు. ప్రత్యక్ష ప్రసారాలపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తామని వెల్లడించారు. ప్రత్యక్షప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!
కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలి? కరోనా బాధితులు టీకా ఎప్పుడు తీసుకోవాలి? వంటి అంశాలపై కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారికి రేపే నగదు జమ!
పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19వేల కోట్లు అందనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పటిష్టంగా లాక్‌డౌన్
రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు ఆంక్షలు సడలించిన పోలీసులు 10 గంటల తర్వాత దుకాణాలు మూసివేయించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన పోలీసులు... అకారణంగా బయటకు వచ్చిన వారికి జరినామాలు విధిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.