పీల్చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో 15 రోజుల కొవిడ్ చికిత్సకు రూ.22 లక్షల బిల్లు వేశారు. అయినా ప్రాణం దక్కలేదు. కూకట్‌పల్లిలోని ఓ దవాఖానాలో పది రోజులు చికిత్స పొందితే రూ.18 లక్షలు వసూలు చేశారు. తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మరో బాధితుడికి 12 రోజుల చికిత్సకు రూ.15 లక్షల బిల్లు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'రహస్య ప్రాంతానికి ఆనందయ్య '
కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఆనందయ్య మందు (Anandaiah Medicine)పై తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేసులు తగ్గుతున్నాయి
దేశంలో కొత్తగా 1.73 లక్షల మందికి వైరస్(Covid cases in India) నిర్ధరణ అయింది. మరో 3,617 మంది కొవిడ్‌తో(covid-19) మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,22,512కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆంజనేయుని జన్మస్థలంపై వివాదం'
ఆంజనేయుడి జన్మస్థలంపై నెలకొన్న వివాదం.. ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తిరుగిరుల్లోని అంజనాద్రే హనుమాన్ జన్మస్థలమని తితిదే చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్న హనుమద్ జన్మభూమి తీర్థట్రస్ట్.. గురువారం నాటి సంవాదం తర్వాత.. తమవాదనే నెగ్గిందని తితిదే పండిత పరిషత్ చేసిన ప్రకటనను ఖండించింది. వాల్మీకి రామాయణం మాత్రమే ఆంజనేయుడి విషయంలో పరమ ప్రామాణికమని పునరుద్ఘాటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొవిడ్‌లో ప్రెగ్నెన్సీ.. శిశువుకి ప్రమాదమా?
తనకు ఈ మధ్యే కొవిడ్(covid) వచ్చింది. ఇంట్లోనే ఉంటూ ఐదు రోజుల కోర్సు వాడింది. డోలో(dolo), డాక్సీ ఐవెర్‌మెసిటిన్(Doxy Ivermektin), జింక్(Zinc) కోల్డ్(Cold) మాత్రలు వేసుకుంది. కోలుకునేసరికి నెలతప్పినట్టు(pregnancy) తెలుసుకుంది. తాను వాడిన మందులు ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతాయా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలా..? అని ఓ సోదరి అనుమానం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.