1.ఆదిలాబాద్‌లో కాల్పుల కలకలం
ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పుల మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాతకక్షలతో రాజకీయ ప్రత్యర్థులైన ఫరూక్ అహ్మద్, వసీం వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు జరపగా... ముగ్గురు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.పరువు తీసి వేధిస్తున్న లోన్ యాప్స్
ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రుణం ఇస్తామంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. వాళ్ల వేధింపులకు ఒక్కనెలలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కేసీఆర్ నిజాం పాలనను మరిపిస్తున్నారు
భాజపా ప్రభుత్వం.. ప్రజల ఒక్కో సమస్యను క్రమంగా పరిష్కరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. కరోనా వేళ ప్రజలు అవస్థలు పడినా.. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకురాలేదన్నారాయన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.కీలకంగా మారిన నిఘా నేత్రలు
జంటనగరాల్లో రహదారి ప్రమాదాల నిర్ధరణలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది, తప్పెవరిది తెలుసుకునేందుకు నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.కరోనా దావాగ్నిలా వ్యాపించింది
నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాప్తి చెందిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.