1.చంద్రయాన్-3: భూమిపై జాబిల్లి బిలాల సృష్టి!
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో వైఫల్యాలను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగళూరు సమీపంలో చంద్రుని ఉపరితలాన్ని కృత్రిమంగా సృష్టించి ల్యాండర్‌ను పరీక్షించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పార్లమెంటుకు వచ్చే ఎంపీలకు కరోనా టెస్టులు!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభ కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. ఉభయ సభల అధికారులు, ఆరోగ్య శాఖ, డీఆర్డీఓ అధికారులతో సమావేశమై చర్చించారు. 72 గంటల ముందే ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు స్పీకర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి
హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్, కాలనీ అసోసియేన్లతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. కరోనా భయాన్ని పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో మరోసారి విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ అనుమతులు అవసరం లేవని కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని కోరింది. కమిటీ సభ్యులను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి ప్రాజెక్టు చూపెడతామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం
కొవిడ్‌పై పోరులో భాగంగా రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.