తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @11AM - telangana top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news of telangana today till now
టాప్​టెన్ న్యూస్ @11AM

By

Published : Jan 7, 2021, 10:58 AM IST

  • ప్రజాస్వామ్యంపై దాడి

అమెరికాలో ప్రజాస్వామ్యం అసాధారణ దాడికి గురైందన్నారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. క్యాపిటల్​ భవనంలో జరిగిన ఘర్షణ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది నిజమైన అమెరికాను ప్రతిబింబించదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికా క్యాపిటల్‌ భవనంలో ఘర్షణ

అమెరికా క్యాపిటల్‌ భవనంలో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా.. ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికా ఉద్రిక్తతలు బాధాకరం

అమెరికా కాంగ్రెస్​ సమావేశం సందర్భంగా క్యాపిటల్​ భవనం వద్ద చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిచారు. అగ్రరాజ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశంలో 20,346 కొత్త కేసులు

దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య కోటి దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా 20వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 379 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 3 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 2,88,789 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1,559 మంది మృతిచెందారు. మహమ్మారి నుంచి మరో 305 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ట్రాక్టర్​ ఎక్కిన రైతన్న

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యాన్ని సాధించే వరకూ వెనకడుగు వేయబోమని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు స్పష్టం చేశారు. వర్షం కారణంగా బుధవారం వాయిదాపడిన ట్రాక్టర్ల ర్యాలీని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆఫీసు స్థలానికి పెరిగిన గిరాకీ..

హైదరాబాద్‌లో ఆఫీసు స్థలం అద్దెకు తీసుకోవటం, ఇళ్ల కొనుగోళ్లు గత ఏడాది ద్వితీయార్ధంలో గణనీయంగా పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఒక తాజా నివేదికలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎస్​ఐకి గవర్నర్ తమిళిసై అభినందన

వృద్ధ మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడంలో సాయం చేసిన పాలకుర్తి ఎస్​ఐ సతీశ్​ను గవర్నర్ తమిళిసై అభినందించారు. ఈ మేరకు ఆయనను రాజ్​భవన్​కు ఆహ్వానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సిరాజ్‌ కంటతడి

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు సందర్భంగా ఓ ఉద్విగ్న సంఘటన జరిగింది. భారత జాతీయ గీతం ప్రారంభం కాగానే ఉద్వేగానికి లోనయ్యాడు పేసర్ మహ్మద్ సిరాజ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'థాంక్ గాడ్​'లో రకుల్

టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ సెట్ అయింది. మారుతి-గోపీచంద్ ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయనున్నారు. ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్ సింగ్ అజయ్ దేవ్​గణ్​తో మరోసారి కలిసి పనిచేసే​ అవకాశం దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details