- ఎట్టకేలకు అంగీకరించింది..
ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో తమ దేశానికి చెందిన 11 మంది ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు ఎట్టకేలకు అంగీకరించింది పాకిస్థాన్. ఈ మేరకు పాక్ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ హై ప్రోఫైల్ ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లను చేర్చింది. అయితే.. ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయిద్, మసూద్ అజార్, దావూద్ ఇబ్రహీంల పేర్లు చేర్చకపోవటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పటివరకు పంపిణీ చేయొద్దు..
గిరిజన ప్రాంతాల్లో అనుమతి లేని నిర్మాణాలకు హక్కులు కల్పిస్తూ మెరూన్ పాస్ పుస్తకాలను ఈనెల 19 వరకు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధ్రువపత్రాల పరిశీలన వాయిదా..
స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. రేపటి నుంచి ఈనెల 19 వరకు జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివరణ ఇవ్వండి..
ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట..
లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ, ఆర్డీవో ముందే తెరాస, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒకానొక సమయంలో కుర్చీలు విసురుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివేకానంద విగ్రహాం ఆవిష్కరణ..