తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news

By

Published : Jan 30, 2022, 10:58 AM IST

  • దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్​లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం మరో 2,34,281 మందికి కొవిడ్ వైరస్​ సోకింది. ఒక్కరోజులో 893 మంది మరణించారు. 3,52,784 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • నియోకొవ్​ వైరస్​తో భారత్​కు ముప్పు ఉందా?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్​ నుంచి వచ్చిన మరో వైరస్​ నియోకొవ్​ ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్​ అత్యంత వేగంగా వ్యాపించగలదని, మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని చైనా వుహాన్​ ల్యాబ్​ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. అయితే.. నియోకొవ్​తో భారత్​కు ముప్పు పొంచి ఉందా?

  • తండ్రుల ఓటమికి ప్రతీకారంగా బరిలోకి కుమార్తెలు

ఉత్తరాఖండ్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తండ్రుల ఓటమికి ప్రతీకారంగా ఇద్దరు కుమార్తెలు ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. అంతేకాదు వీరు ఎదుర్కొంటున్న ప్రత్యర్థులు కూడా నాడు వారి తండ్రిని ఓడించిన వారే కావడం గమనార్హం.

  • మన వారితో మనకే మస్కా

సైబర్‌ నేరాలు కొత్త పంథాలో జరుగుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే తెలుగు యువకులకు ఎరవేసి.. దారికి తెప్పించుకుంటున్నారు. ఇలా మనవారితోనే మనల్ని బురిడీ కొట్టిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

  • బీటెక్‌ సీట్లలో 10 శాతం కోత

ఇంజినీరింగ్​ కాలేజీలకు ఏఐసీటీఈ షాక్​ ఇచ్చింది. బీ-కేటగిరీ సీట్ల భర్తీలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్లు పాటించడం సహా ఇతర ఫిర్యాదులపై చర్యలు తీసుకొంది. ఆయా 14 కళాశాలల్లోని మొత్తం సీట్లలో 10 శాతం కోత పెట్టింది.

  • ఆ రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం

ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో పూర్తిస్థాయి యుద్ధమనే వాదనను తోసిపుచ్చకుండానే.. ప్రస్తుత పరిస్థితులను ఎక్కువ చేసి చూపించడంపై మండిపడ్డారు!

  • ఆఫీసుకు వెళ్లే ఉద్దేశం ఉందా?

దేశవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్వహించిన 'టెక్‌ ట్యాలెంట్​ సర్వే'లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా కారణంగా చాలామంది ఆఫీసుకు వెళ్లడం కంటే ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

  • పంద్రాగస్టు నాటికి స్వదేశీ రోబో

రానున్న రోజుల్లో మన దేశ సరిహద్దుల్లోనూ రోబోలు పహారా కాయనున్నాయి. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిఫెన్స్‌ రోబోల రూపకల్పనకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆలిండియా రోబోటిక్స్‌ అసోసియేషన్‌ శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15నాటికి రోబో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐరా ఛైర్మన్‌ పి.ఎస్‌.వి.కిషన్‌ తెలిపారు.

  • క్రికెట్ మ్యాచ్​ మధ్యలో భూకంపం

ఓ క్రికెట్ మ్యాచ్​ జరుగుతుండగా స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. అయితే ఆటగాళ్లు మాత్రం యథావిధిగా తమ ఆటను కొనసాగించి మ్యాచ్ పూర్తిచేశారు. ఈ సంఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది.

  • అలా అస్సలు ఆలోచించను

తన బాడీ ఇమేజ్​పై వస్తున్న ట్రోల్స్ గురించి హీరోయిన్ అవికా గోర్ మాట్లాడింది. అవేవి ఆలోచించనని, నటనపై మాత్రమే దృష్టి పెట్టానని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details