తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - top ten news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
తెలంగాణ టాప్ న్యూస్

By

Published : Jul 20, 2021, 9:00 AM IST

  • హుజూరాబాద్​ తెరాస అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election)లో గెలుపు కోసం గులాబీ పార్టీ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేస్తోంది. ఓ వైపు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ ఈటల రాజేందర్(Etela Rajender) వైపు మొగ్గు చూపకుండా ప్రయత్నిస్తూ.. మరో వైపు అన్నివర్గాలను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేయక పోయినప్పటికీ.. సీనియర్ నేతలను రంగంలోకి దించి.. విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఆచిచూచి వ్యవహరిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సమితి... కొత్త ప్రయోగం దిశగా పావులు కదుపుతోందని ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గురుకులాలపై ప్రవీణ్‌ కుమార్ ముద్ర

ఆర్​.ఎస్ ప్రవీమ్ కుమార్... ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం తెలంగాణ గురుకులాల కార్యదర్శిగానే కాకుండా పోలీసు అధికారిగానూ సమర్థంగా సేవలందించారు. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలకు పూలబాట వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తుది దశకు చేరుకున్న కసరత్తు

ఉద్యోగాల ఖాళీల కసరత్తు తుది దశకు చేరుకొంది. ఆయా శాఖల వారీగా ఉన్న పోస్టులు, ఖాళీలకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయింది. అన్ని శాఖల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి ఆర్థికశాఖ నివేదిక సిద్ధం చేయనుంది. ఖాళీల సంఖ్య దాదాపుగా 60 వేల వరకు ఉండవచ్చని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సరిహద్దు వార్

అసోం- మిజోరం సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పది రోజుల క్రితం అసోంలోని కచార్‌ జిల్లాలో ఒకటి, మరుసటి రోజు మిజోరం సరిహద్దుల్లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం లుషాయ్‌ కొండలు, బరాక్‌ లోయ, నదులు, అడవులతో నిండి ఉన్నందువల్ల కచ్చితంగా హద్దులను గుర్తించడం కష్టం. ఫలితంగా ఇరువైపులా గ్రామీణులు చాలా సందర్భాల్లో సరిహద్దులు దాటి ముందుకు వెళ్ళి సాగుచేస్తున్నారు. నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇది ప్రజాద్రోహం

కొన్నాళ్లుగా పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, నిరసనకారులు, రైతులు తదితరులపై రాజద్రోహం కేసులు బనాయిస్తుండటంపట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ మధ్య హరియాణాలో 100 మంది రైతులపైనా రాజద్రోహ నేరాభియోగాలు మోపిన ఘటన వెలుగు చూసింది. పౌర స్వేచ్ఛను క్రూరంగా చిదిమేయడమే లక్ష్యంగా ఐపీసీలో చొప్పించిన చట్టాల్లోకెల్లా అత్యంత పాశవికమైనదని బాపూజీ ఆనాడే ఛీత్కరించిన సెక్షన్‌ను ఇటీవలికాలంలో కొందరు గౌరవ న్యాయాధీశులూ తప్పుపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయి?

కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు 9 నెలలు పాటు కొనసాగుతాయని పరిశోధకులు వెల్లడించారు. ఇన్​ఫెక్షన్ సమయంలో వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకున్నా.. యాంటీబాడీలు అంత సమయం పాటు మనుగడలో ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఎడారి' నుంచి అంతరిక్షంలోకి..

నేడు అంతరిక్షంలో విహరించనున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ముగ్గురితో కలిసి 'న్యూ షెపర్డ్‌' వ్యోమనౌక ద్వారా పయనించనున్నారు. విశ్వంలోకి అతిపెద్ద, పిన్న వయస్కులు ఈ యాత్రలోనే వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఒక్క మిస్డ్​కాల్​తో ఫోన్​ హ్యాక్​!

ఎవరో వచ్చి కాలింగ్‌బెల్‌ నొక్కుతారు. మీరు తలుపు తెరవగానే దాడి చేసి లోపలికి చొరబడటం ఒకెత్తు. కానీ తలుపు తెరవాల్సిన పనిలేకుండా, కేవలం కాలింగ్‌ బెల్‌ నొక్కటంతోనే మీ ఇంట్లోకి చొరబడితే? చొరబడిన విషయం కూడా మీకు తెలియకుంటే? ఇదేదో అదృశ్య శక్తిరూపంలో పాతకాలపు విఠలాచార్య సినిమాలో దృశ్యంలానో ఉందనిపిస్తోంది కదూ. తాజాగా దుమారం రేపుతున్న ఇజ్రాయెల్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ అచ్చం అలాంటి అదృశ్యశక్తి లాంటిదే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎలా ఆడతాడో..

ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​కు ముందు కౌంటీ సెలెక్ట్​ ఎలెవన్​తో (INDIA vs COUNTY SELECT ELEVEN) వార్మప్​ మ్యాచ్​ ఆడనుంది టీమ్ఇండియా.​ యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ గైర్హాజరీలో రోహిత్​తో కలిసి మయాంక్ అగర్వాల్​(Mayank Agarwal) ఇన్నింగ్స్​ను ప్రారంభించే అవకాశాలున్నాయి. తొలి టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న మయాంక్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'నారప్ప' సినిమా ఎలా ఉందంటే..

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'నారప్ప'(Narappa). తమిళ మూవీ 'అసురన్​'కు (Asuran) రీమేక్​గా రూపొందింది. కరోనా కారణంగా ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details