- నేడు కేబినెట్ భేటీ..
కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. లాక్డౌన్ విషయమై తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మూడో వేవ్ సన్నద్దతపైనా దృష్టి సారించనుంది. వానాకాలం పంటలు, సాగునీటి ప్రాజెక్టుల సంబంధిత అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఉద్యోగులకు గుడ్న్యూస్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు, పింఛనర్ల వేతన సవరణ (పే రివిజన్) అంశాలు మంగళవారం మంత్రిమండలి ఆమోదానికి రానున్నాయి. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పీఆర్‌సీ, ఫిట్‌మెంటు, ఇతర నిర్ణయాల అమలును ఎజెండాలో చేర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- వారికి ముందుగానే రెండో డోసు
విదేశాలకు వెళ్లే విద్యార్థులు, క్రీడాకారులకు 84 రోజుల కంటే ముందే కొవిషీల్డ్ టీకా తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మళ్లీ తెరపైకి పీవీ జిల్లా
పీవీ నరసింహారావు జిల్లా.. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుజూరాబాద్ కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. అది చేస్తే కరీంనగర్ జిల్లా పరిధి చాలా తగ్గుతుందని ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. తాజాగా పీవీ శతజయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ పీవీ జిల్లాను ప్రకటించాలనే వినతులు మొదలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బ్రెయిన్ ట్యూమర్ డే
అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్ బ్రెయిన్ ట్యామర్ డే సందర్భంగా మెదడు కణితులపై సమాచారం మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మద్యం తాగిన చిన్నారులు