- దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు
ఆక్సిజన్ కొరత పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. పీఎం కేర్స్ నిధులతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో 551 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వీలైనంత త్వరగా ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దిల్లీలో లాక్డౌన్ పొడిగింపు
దిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే వారం రోజుల పాటు దిల్లీలో లాక్డౌన్ విధించారు కేజ్రీవాల్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తుపానులా కరోనా రెండో దశ
కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొవిడ్ టీకాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దని 'మన్‌కీ బాత్' రేడియా కార్యక్రమంలో తెలిపారు. వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని వణికించిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- టీకా ధర తగ్గించాల్సిందే
కరోనా టీకా ధరను వీలైనంత తక్కువగా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. కొవిషీల్డ్ టీకాను భారత్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నారని అన్నారు. అదనపు లాభాల కోసం సీరం సంస్థ.. టీకా రేట్లను పెంచిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆ ఫ్యాన్ అంటే భయం
మధ్యప్రదేశ్ ఛింద్వాడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగికి విచిత్రమైన బాధ వచ్చిపడింది. తన పడక వద్ద తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వల్ల ప్రాణాలకు ముప్పుందని వాపోతూ అతను పోస్టు చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాన్ని మార్చమని అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోట్లేదని తెలిపాడు. 'నేను కరోనా వైరస్‌కు భయపడట్లేదు.. ఈ ఫ్యాన్‌ని చూసి భయపడుతున్నా(కరోనా సే ఢర్ నహీ లగ్తా సాబ్, ఫ్యాన్ సే లగ్తా హై) నన్ను వేరే బెడ్‌కి మార్చండి'' అని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- బరిలో రౌడీషీటర్లు