తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​న్యూస్ @ 9AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news, telangana updates
తెలంగాణ వార్తలు, తెలంగాణ టాప్ న్యూస్

By

Published : Mar 30, 2021, 8:59 AM IST

  • నేడే చివరి రోజు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడు తుది గడువు కావడం వల్ల.. ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా ఇతరులూ పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌తోపాటు... తెరాస, భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రైతుల్ని ముంచారు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో అక్రమాల వ్యవహారం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో ఉమ్మడి వరంగల్‌, నల్గొండ డీసీసీబీల్లో జరిగిన అక్రమాలు కొలిక్కి రాకముందే పాత ఖమ్మం డీసీసీబీలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు సహకారశాఖ తేల్చింది. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులను మోసం చేసి వివిధ పేర్లతో వారి నుంచి సొమ్ము వసూలు చేసి ఇష్టారీతిగా ఖర్చు చేయడానికి మాజీ ఛైర్మన్‌, సీఈఓలే కారణమని విచారణలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సమగ్ర భూ సర్వేకు సిద్ధం..

ఉపగ్రహ ఛాయా చిత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టనున్నారు. హెచ్​ఎండీఏ ప్రాంతం మినహా.. రాష్ట్రంలోని దాదాపు 80 వేల చదరపు కిలోమీటర్ల మేర డిజిటల్ సర్వే జరగనుంది. అటవీ సరిహద్దు ప్రాంతాన్ని.. లైడార్ స్కానింగ్ చేస్తారు. ఆర్​ఓఆర్​లోని వివరాలు, ఉపగ్రహ ఛాయా చిత్రాలను అనుసంధానించి.. అప్పీళ్లను పరిష్కరించాకే తుది దస్త్రాలను రూపొందిస్తారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆమె గెలిస్తే జాతీయ ప్రాధాన్యమే!

బంగాల్​లో మమత బెనర్జీ మూడోసారి కూడా జయభేరి మోగిస్తే- జాతీయ స్థాయిలో ఆమె పాత్ర, ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. కాంగ్రెస్​ దినదినం పట్టుకోల్పోతున్న వేళ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని టీఎంసీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బావిలో పడి ఐదుగురు మృతి

మేఘాలయలోని ఓ లోతైన బావిలో నిర్మాణ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఐదుగురు కూలీలు చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇక్కడ మునిగితే.. తేలేది శవంగానే!

అందమైన ఆరావళీ పర్వతాల మధ్యలో ఉందో సరస్సు. మనస్సుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ సరస్సులో కాలుపెట్టారో కాలనాగు కాటువేస్తుంది. అదే హరియాణాలోని డెత్ వ్యాలీ. పేరులోనే మృత్యువు దాగి ఉన్న ఈ సరస్సులో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఎందుకిలా జరుగుతుందంటే..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విదేశీ మంత్రులతో జైశంకర్​

తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ గనీతో, ఇరాన్​, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు భారత విదేశీ వ్యవహారలశాఖ మంత్రి ఎస్​. జైశంకర్. మంగళవారం ఇక్కడ జరిగే 'హార్ట్​​ ఆఫ్ ఏసియా' సదస్సులో ఆయన పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మార్పునకు రెడీయా?

ఏప్రిల్​1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. బడ్జెట్‌లో ప్రకటించే అనేక ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేది ఈ తేదీ నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. ఇక.. ఏప్రిల్​1 నుంచి ఇంకా ఏఏ మార్పులు జరుగబోతున్నాయో తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేను చూసిన జైసింహా అతడే

టీమ్డి ఇండియా లెజెండ్ సునీల్ గావస్కర్ ఆరాధ్య క్రికెటర్ ఎమ్ఎల్ జైసింహా. చిన్నతనంలో జైసింహా ఆట చూసి, ఆ తర్వాత అతనితో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న గావస్కర్‌.. తన ఆరాధ్య ఆటగాడిని ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటాడు. తాజాగా హైదరాబాద్ విచ్చేసిన గావస్కర్.. జైసింహా స్పోర్ట్స్ ఫౌండేషన్​ ప్రారంబోత్సవంలో ఉపన్యాసం ఇచ్చాడు. తన మనసులోని భావాలను పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ సినిమా నాకొక పాఠశాల

'యానిమల్'​ చిత్రంలో అనిల్​ కపూర్​, రణ్​బీర్​ కపూర్​తో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది హీరోయిన్​ పరిణీతి చోప్రా. ఈ చిత్రం తనకు ఓ పాఠశాల లాంటిదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details