తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 9AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్@ 9AM

By

Published : Mar 21, 2021, 8:59 AM IST

  • గులాబీకే పట్టభద్రుల పట్టం

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది..హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి విజయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్‌ స్థానం నుంచి సురభి వాణీదేవి గెలవగా, నల్గొండ స్థానాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ!

రెండు పట్టభద్ర స్థానాల్లో విజయం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు కురిపించే అవకాశం ఉంది. త్వరలోనే ఆయన ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారుల సంఘాలతో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మండలిలో చోటు గల్లంతు

దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న కమలదళానికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. రెండు స్థానాల్లోనూ విజయం తమదేనంటూ ధీమాగా బరిలోకి దిగిన ఆ పార్టీకి ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. శాసనమండలిలో భాజపాకు ప్రస్తుతం ఒక సభ్యుడు ఉండగా, తాజా ఫలితాలతో ప్రాతినిధ్యం కోల్పోయినట్లయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మార్మోగిన మల్లన్న

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ నియోజకవర్గంలో పల్లా విజయకేతనం ఎగురవేసినప్పటికీ.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. విజయం వరించకపోయినప్పటికీ... స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఓట్లు సాధించడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భాజపా, కాంగ్రెస్​, తెజసలను పక్కకునెట్టి ఇన్ని ఓట్లు గెలుచుకోవడం మల్లన్నకు ఎలా సాధ్యమైంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మట్టిలో కూరుకుపోయి..

మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బెంగళూరు మరో దిల్లీ కావాలి

దిల్లీలో మాదిరిగానే కర్ణాటకలోనూ రైతులు నిరసనలు చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. బెంగళూరును అన్ని వైపుల ట్రాక్టర్లతో ముట్టడించాలని అన్నారు. శివమొగ్గ రైతు సభకు హాజరైన టికాయిత్​ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్నికలున్నా ఫ్లెక్సీలు లేవు

సాధారణంగా ఎన్నికల ప్రచారం అంటే ఇల్లిల్లూ తిరగడం, మైకులు, ప్రచార రథాలు, సభలు, సమావేశాలు ఉంటాయి. వీటికి తోడు బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లు సరేసరే. శాసనసభ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రంలో మాత్రం బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లు, జెండాల పాత్ర మాత్రం చాలా తక్కువే కనిపిస్తోంది. పార్టీలు వీటి పేరు చెబితేనే వణికిపోతున్నారు. మరి అలా జరుగుతుంది ఏ రాష్ట్రంలో, పార్టీలకు అవంటే ఎందుకు భయం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కనుపాపలే.. పాస్‌పోర్టులు!

గత నెలలో దుబాయ్‌ విమానాశ్రయం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. చెక్‌ ఇన్‌ సమయంలో ప్రయాణికులు ఐరిస్‌ స్కానర్‌ వద్ద నిలుచుంటే చాలు.. పాస్‌పోర్టు వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదైపోయేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పేపరు టికెట్లు, ఫోన్‌ యాప్‌లకు కూడా కాలం చెల్లేలా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేను రెడీ

జట్టు అవసరాల దృష్ట్యా విరాట్​తో ఇన్నింగ్స్​ ప్రారంభించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హిట్​మ్యాన్ స్పష్టం చేశాడు. వీరిద్దరూ ఓపెనర్లు వచ్చిన చివరి టీ20లో ఇంగ్లాండ్​పై భారత్ ఘనవిజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వినగానే.. ప్రేమలో పడిపోయా

చిన్ననాటి నుంచి తనకు నటనపై మక్కువ వల్ల సినిమా రంగంలో అడుగుపెట్టానని అంటోంది హీరోయిన్​ మిషా నారంగ్​. ఆమె నటించిన 'తెల్లవారితే గురువారం' చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాల గురించి మీడియాతో ముచ్చటించింది మిషా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details