- శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇటీవల మరణించిన నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. సంతాపాల తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
ఏపీలో.. అమరావతి భూముల క్రయవిక్రాయలకు సంబంధించి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఇళ్లకు వెళ్లి.. వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆ స్థితికి దిగజారారు
తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబుపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితికి వైకాపా దిగజారిందని ఆగ్రహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నడిరోడ్డుపై నరికేశాడు
తమిళనాడులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తన భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా ఈ హత్యకు పాల్పడ్డాడు నిందితుడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు
పార్లమెంట్ ఉభయ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. షెడ్యూల్డ్ కులాల సవరణ బిల్లు-2021పై ఈరోజు చర్చ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భద్రతపై రాజీ పడటమే