- చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. ఏపీ రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 204 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సీఎంకు స్టాలిన్ సవాల్
అన్నాడీఎంకే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిందని డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆరోపించారు. తమ పార్టీ ఏం ప్రకటిస్తుందా అని అన్నాడీఎంకే ఎదురుచూస్తోందని ఎద్దేవా చేశారు. జయలలిత మరణంతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణల్ని నిరూపించాలని సీఎం పళనిస్వామికి సవాలు విసిరారు స్టాలిన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్నికలు సమీపించే కొద్దీ తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదట కూటమిగా ఏర్పడిన పార్టీలు సీట్ల పంపకాల విషయానికి వచ్చే సరికి చీలిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా కొత్త పార్టీలతో జతకడుతున్నాయి. ఇలా జరగడం తమిళనాట కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. దీంతో కూటముల స్వరూపం మారిపోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఐరాస డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా సాగు చట్టాలు
నూతన సాగు చట్టాలు ఐరాస డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ విషయాన్ని ఐరాస మానవ హక్కుల మండలి దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు, దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమానికి 110 రోజులు పూర్తైన నేపథ్యంలో.. ప్రైవేటీకరణ-కార్పొరేటీకరణ వ్యతిరేక దినాన్ని జరుపుతున్నట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఫేస్బుక్లో టీకా 'లేబుల్స్'
టీకా పంపిణీపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టే దిశగా దిగ్గజ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అడుగులు వేస్తోంది. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటన విడుదల చేశారు. ఫేస్బుక్ సహా అనుబంధ సంస్థల ప్లాట్‌ఫామ్స్‌లో వ్యాక్సినేషన్ పోస్టులకు లేబుల్స్ జతచేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 192పాయింట్లకు పైగా లాభంతో.. 50 వేల 587 ఎగువన ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- స్పోర్ట్స్ ప్రెజెంటర్స్ వెడ్స్ స్టార్ క్రికెటర్లు!
టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్‌ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వివాహబంధంతో తామిద్దరం ఒక్కటైనట్లు ఇరువురు సోమవారం ప్రకటించారు. ఐతే గతంలోనూ స్పోర్ట్స్ ప్రెజెంటర్‌లను పెళ్లాడిన క్రికెటర్లు ఉన్నారు. ఆ జంటలెవరో ఈ సందర్భంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- 'రామ్‌సేతు' షూటింగ్ ఆరోజే!
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్న చిత్రం 'రామ్‌సేతు'. ఈ సినిమా మార్చి 18న అయోధ్యలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి