తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 1PM

By

Published : Mar 15, 2021, 12:59 PM IST

  • బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగించారు. కాసేపట్లో సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ వ్యూహాత్మక అడుగులు

కొవిడ్ వల్ల దేశమంతా ఇబ్బంది పడిందని, కానీ తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో గవర్నర్​ ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దేశానికే ఆదర్శం

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా

కొన్నేళ్లుగా శాసనసభలో ప్రజల గొంతు వినిపించేవారు లేరని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ విమర్శించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతానని పేర్కొన్నారు. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు భాజపా ఎమ్మెల్యేల నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే

నోటాకు అధిక ఓట్లు వస్తే ఆ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ భాజపా నేత ఒకరు.. సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని కేంద్రంతో పాటు, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నాగ్​పుర్​లో లాక్​డౌన్

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో​ సోమవారం లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యశ్వంత్ సిన్హాకు కీలక పదవులు

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్​ సిన్హా తృణమూల్​ కాంగ్రెస్​ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన ఇటీవలే భాజపాను వీడి తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనా గబ్బిలాల్లో కొత్త రకం కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి తీసుకొచ్చారు. గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనా వైరస్​లను గుర్తించారు. చిన్న ప్రదేశంలోనే ఇన్ని రకాల వైరస్​లు బయటపడటం పట్ల శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ లక్ష్యంతోనే సింధు ప్రాక్టీస్!

థాయ్​ ఓపెన్​లో వైఫల్యాలు చవిచూసిన పీవీ సింధు.. స్విస్​ ఓపెన్​తో తిరిగి గాడిలోకి వచ్చింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్​కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో సాధన, ఆల్​ ఇంగ్లాండ్ ఛాంపియన్స్​కు సన్నద్ధత.. వంటి విషయాలపై ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీత పాత్రలో ఆలియా

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న'ఆర్​ఆర్​ఆర్'​లోని హీరోయిన్​ ఆలియా భట్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం అక్టోబర్​ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details