తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Mar 14, 2021, 10:57 AM IST

  • కన్నవారే కర్కశంగా..

నెలలు నిండని పసిగుడ్డును కన్నవాళ్లే కడతేర్చిన అమానుషమైన ఘటన గుజరాత్​లోని కాదీ మెహ్సానా జిల్లాలో చోటు చేసుకుంది. ఆడ శిశువు పుట్టిందని తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి.. నెల వయసు ఉన్న ఆ చిన్నారి ప్రాణం తీశారు. దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 25,320

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 25,320 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మరో 161 మంది మరణించారు. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 16 వేల మందికిపైగా కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 228

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో 228 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • దానిపై టీకా పనితీరు అంతంతే!'

ఇటీవల వెలుగులోకి వస్తున్న కొత్త రకం కరోనా వైరస్​లపై వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రంగానే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వుహాన్​లో వెలుగులోకి వచ్చిన వైరస్​తో పోలిస్తే, ఈ కొత్త కరోనా రకాలు.. టీకాల ద్వారా విడుదలైన యాంటీబాడీలను అధికంగా ప్రతిఘటిస్తున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఓటేసిన అభ్యర్థులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఓటేసిన నేతలు, అధికారులు

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, పోలీసులు, అధికారులు ఈ పోలింగ్​లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 200 మంది ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం దాదాపు 200 మంది ముష్కరులు క్రియాశీలకంగా ఉన్నారని డీజీపీ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. మరో 250 మంది.. సరిహద్దుల్లో ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇదే సంకేతం

దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్ వెల్లడించారు. 'వి' ఆకారపు రికవరీ కోసం దేశం ఎదురు చూస్తోందని తెలిపారు. సాంకేతిక మాంద్యం నుంచి దేశం కోలుకుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బాక్సర్ మార్విన్ హేగ్లర్ మృతి

14 ఏళ్ల పాటు మిడిల్ వెయిట్​ బాక్సర్​గా గుర్తింపు తెచ్చుకున్న మార్విన్ హేగ్లర్.. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. తన కెరీర్​లో 52 మ్యాచ్​ల్లో నాకౌట్​ విజయాలు సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'అవెంజర్స్​'ను అధిగమించిన 'అవతార్​'!

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్​ కెమెరూన్ రూపొందించిన​ 'అవతార్​'.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా మరోసారి ఘనత సాధించింది. ఇటీవలే చైనాలో రీ-రిలీజ్​ అయిన చిత్రానికి.. శుక్రవారం ఒక్కరోజే రూ.25.44 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో 'అవెంజర్స్​:ఎండ్​గేమ్​' దాటుకొని మరోసారి ఆ జాబితాలో అగ్రస్థానానికి 'అవతార్​' చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details