తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Mar 13, 2021, 10:59 AM IST

  • భారత్ @ 24, 882

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 24 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 216

రాష్ట్రంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 216 కొవిడ్ కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మహారాష్ట్ర సర్కార్​ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు.. ఔరంగాబాద్​లో వారాంతాల్లో లాక్​డౌన్​ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పర్యటక బస్సు- ట్రక్కు ఢీ

పర్యటకులు ప్రయాణిస్తున్న బస్సు ఓ భారీ ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. రాజస్థాన్​లోని బాప్​ ప్రాంత పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందింది. కూర్చున్న చోట కూర్చున్నట్లే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బెయిల్​ కోసం కోర్టుకు సచిన్​ వాజే

ముందస్తు బెయిల్​ కోసం ఠాణె కోర్టును ఆశ్రయించారు సచిన్​ వాజే. అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు లభించిన కారు యజమాని మన్​సుఖ్​ హిరేన్​ మృతి కేసులో ఆయన​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆసియా దేశాలకు సౌదీ కోత

ముడి చమురు ఉత్పత్తి, సరఫరాదారు దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా తన ఎగుమతులను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఆసియా దేశాలకు ముడిచమురు ఎగుమతుల్లో కోత పడనుంది. అయితే భారత్‌కు మాత్రం సరాసరిన నెలవారీ చమురు సరఫరా చేయనున్నట్లు సౌదీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అఫ్గానిస్థాన్​లో కారు బాంబు పేలుు

అఫ్గానిస్థాన్​లో జరిగిన కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మరణించగా.. 47మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బుమ్రాను అధిగమించిన చాహల్​

టీ20ల్లో టీమ్​ఇండియా స్పిన్నర్ చాహల్ కొత్త రికార్డు సాధించాడు. పొట్టి క్రికెట్​ ఫార్మాట్​లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా తొలి స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో బుమ్రా కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ రోజే విడుదల

మంచు విష్ణు, కాజల్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మోసగాళ్లు'. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details