తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Mar 11, 2021, 10:57 AM IST

  • భారత్​ @ 22,854​

దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్తగా 22,854 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మరో 126 మంది మరణించారు. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 18వేల మందికిపైగా కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 194

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం వల్ల కేసులు చాలావరకు తగ్గాయని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 194 మంది మహమ్మారి బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పరమశివుణ్ణి ఎలా అభిషేకించాలి?

భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడిని మనసారా పూజించి, ఏ కోరిక కోరినా ప్రసాదిస్తాడు. నిత్యాభిషేక ప్రియుడు కావడంతో పూలు,పత్రం, నీరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అసలు అభిషేకం ఎలా చేయాలి? అభిషేకంలో ఉన్న అంతరార్థం ఏమిటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాజన్నకు పట్టువస్త్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి దేవాదాయశాఖ, తితిదే తరఫున రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వేములవాడలో భక్తుల అవస్థలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం దాదాపు రెండు గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. చంటిబిడ్డతో దర్శనానికి వచ్చిన ఓ తండ్రి ఆవేదనను పట్టించుకోక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాలు, చెయ్యి నరికిన భర్త

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. చివరకు ఆమె కాలు, చెయ్యి నరికేశాడు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. పదిహేను రోజులకోసారి ఇంటికి రావడం సహించలేకే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ బాలునికి రాహుల్​ బహుమతి

కాంగ్రెస్ అగ్రనేత​ రాహుల్ గాంధీ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నారులతో ముచ్చటించిన ఆయన.. ఈ సందర్భంగా ఓ బాలుడి కోరికను విన్నారు. అనంతరం ఆ బాలుడికి బహుమతిని పంపి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ రాహుల్​ నుంచి ఆ బహుమతి అందుకున్న బాలుడు ఎవరు? ఏంటి ఆ బహుమతి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చైనా.. అతిపెద్ద ప్రమాదకారి

21వ శతాబ్దానికే అతిపెద్ద ప్రమాదకారి చైనా అని అమెరికా పేర్కొంది. అక్రమ విధానాలను అనుసరిస్తూ.. ఇండో -పెసిఫిక్​ ప్రాంతంలో ఆ దేశం​ అలజడులు సృష్టిస్తోందని చెప్పింది. ఈ ఆగడాలను అరికట్టేందుకు తాము రంగంలోకి దిగేమందే యథాతథ స్థితిని డ్రాగన్ మార్చే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • యుద్ధానికి వెళ్తున్నట్టే అనిపించింది

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యువ బ్యాట్స్​మెన్​ శుభ్​మన్ గిల్. అరంగేట్రం మ్యాచ్​లో యుద్ధానికి వెళ్తున్నానే భావన కలిగిందని అభిప్రయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మార్చి 15న ఆస్కార్ నామినేషన్లు

ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డు నామినేషన్లను మార్చి 15న ప్రకటించనున్నారు స్టార్​ దంపతులు ప్రియాంకా చోప్రా, నిక్​ జోనస్. కాగా, ప్రియాంక ప్రస్తుతం 'మ్యాట్రిక్స్ 4', 'టెక్స్ట్ ఫర్ యూ' చిత్రాల్లో నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details