- మన జీవనశైలికి ప్రతిబింబాలు
'ది ఇండియా టాయ్ ఫెయిర్-2021'ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన బొమ్మలు భారతీయ జీవనశైలిలో భాగమైన పునర్వినియోగం, పునర్నిర్మానాలను ప్రతిబింబిస్తాయన్నారు. పర్యావరణ హితమైన బొమ్మలను తయారు చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆన్లైన్లో నిర్మల్ కొయ్యబొమ్మలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలు కొనాలంటే.. ఇక నుంచి అక్కడికి వెళ్లక్కర్లేదు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'ది ఇండియా టాయ్ ఫేర్' ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అంబానీ కేసులో పురోగతి
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఓ నిందితుడి వివరాలను పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్టు
కొవిడ్ ప్రారంభ దశలో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
దిల్లీ ప్రతాప్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది 28 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. మంటలు ఆర్పే క్రమంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కన్నీళ్లు తెప్పిస్తున్న యాడ్