తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 11AM

By

Published : Feb 27, 2021, 10:58 AM IST

  • పీఎస్​ఎల్వీ-సీ 51 కౌంట్​డౌన్​

శ్రీహరి కోటలోని షార్ నుంచి పీఎస్​ఎల్వీ-సీ 51 ప్రయోగానికి కౌంట్​డౌన్ ప్రారంభమైంది. బ్రెజిల్​కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ఆదివారం నింగిలోకి తీసుకువెళ్లనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్ @ 16,488

దేశంలో తాజాగా 16,488 మందికి కరోనా సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 10లక్షల 79వేల 979కి చేరింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 12,771 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 178

రాష్ట్రంలో మరో 178 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందినట్లు పేర్కొంది. తెలంగాణకు రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మాఘ పౌర్ణమి విశిష్టత?

వెండి వెలుగుల పందిరి మాఘపౌర్ణమి. చిమ్మ చీకటికి చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమినాటి రేయి ఎందరికో ఆహ్లాదకరం. ఆనందపరవశం. మాఘమాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో వెలుగులీనుతాడు. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమినే మహామాఘం అని ఓ పండుగలా పాటిస్తారు. మహామాఘి సందర్భంగా మాఘపౌర్ణమి విశిష్టతపై ఈ కథనం మీ కోసం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • త్రివేణి సంగమంలో శ్రీవారికి చక్రస్నానం

కాళేశ్వరం త్రివేణి సంగమంలో తిరుమల శ్రీవారికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. మాఘమాస మహోత్సవంలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మేడారం చినజాతర

మేడారంలో నాలుగు రోజుల చిన్నజాతర నేటితో ముగియనుంది. దూరప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చి తల్లుల దర్శనం చేసుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తలుల్ల వద్దకు భక్తులు కుటుంబసమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • స్నిఫర్​ డాగ్​కు ఘన వీడ్కోలు

మహారాష్ట్రలోని నాసిక్​లో ఓ స్నిఫర్​ డాగ్​కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు అక్కడి​ పోలీసులు. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ శునకం.. 11 ఏళ్ల పాటు తమతో ఉండి ఎన్నో సేవలందించిందని నాసిక్​ సిటీ పోలీస్ బాంబ్​ స్వ్కాడ్​​ బృందం తెలిపింది. ఫిబ్రవరి 24న ఈ కార్యక్రమం జరగ్గా.. శునకాన్ని కారు బానెట్​పై కూర్చోబెట్టి చప్పట్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తండ్రీ కొడుకులు కలిసి..

ఉత్తర్​ప్రదేశ్​లో ఓకే రోజు రెండు దారుణాలు జరిగాయి. ఓ మహిళపై తండ్రీ కొడుకులు కలిసి అత్యచారం చేసి నిప్పుపెట్టారు. మరో ఘటనలో సమీప బంధువే.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • టీ-20ల్లో వీరిదే రికార్డు!

టీ20 ఫార్మాట్​ అంటేనే సిక్సులకు పెట్టింది పేరు. తాజాగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో 8 సిక్సులు బాదిన న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ గప్తిల్.. టీ20ల్లో అత్యధిక సిక్సులతో రికార్డు సృష్టించాడు. టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును తిరగరాశాడు. ఈ నేపథ్యంలో టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన టాప్-5 క్రికెటర్లెవరో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇంట గెలిచారు.. రచ్చ గెలుస్తారా?

బాలీవుడ్​లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ హీరోలు, దర్శకులు. ఇక్కడ వచ్చిన గుర్తింపును అక్కడా పొందాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బాలీవుడ్​లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న వారెవరో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details