తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @ 9AM

By

Published : Feb 8, 2021, 8:59 AM IST

  • ఉత్తరాఖండ్​లో ప్రళయం

దేవభూమి ఉత్తరాఖండ్​లో జల విలయం బీభత్సం సృష్టించింది. అది జరిగిన కొద్ది గంటలకే ధౌలి గంగ నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను నిలిపివేశారు. సోమవారం ఉదయం పునరుద్ధరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 14మందికి చేరిన మృతులు

ఉత్తరాఖండ్‌లో అకస్మికంగా సంభవించిన వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిలో 15 మందిని రక్షించారు సహాయ సిబ్బంది. మరో 14 మృతదేహాలను వెలికి తీసినట్లు చమోలి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పెరుగుతున్న భూతాపం

మానవుడు చేస్తున్న విపరీత పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి ప్రకోపిస్తోంది. భూతాపం పెరిగి మంచు కరుగుతోంది. దీంతో హిమాని నదులు జల ప్రళయం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్​లో జరిగిన జలవిలయానికి భూతాపం కూడా ప్రధాన కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పదేళ్లు నేనే సీఎం

రాష్ట్రానికి మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని... ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం మార్పుపై ఇష్టారీతిన మాట్లాడొద్దని... రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తెరాస నేతలకు తేల్చిచెప్పారు. బాగా పనిచేస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఉంటుందని... లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్నిక రోజే తెలిసేది..

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఎన్నిక రోజే సీల్డ్ కవర్ ద్వారా వెల్లడిస్తామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. పార్టీ ఖరారు చేసిన వారికి ఓటేయాలని కేసీఆర్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రభుత్వ వాటాను అమ్మబోం

ఇటీవల బడ్జెట్​లో ప్రవేశపెట్టిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ విధానంలో ఆయా సంస్థలను వ్యూహాత్మక, వ్యూహత్మకం కానీ రంగాలుగా వర్గీకరించిది. ఇందుకు సంబంధించిన విధివిధానలను ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రామాలయానికి క్రైస్తవుల భారీ విరాళం

అయోధ్య రామమందిర నిర్మాణానికి హిందువులే కాకుండా ఇతర మతాల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆ మహాకార్యంలో 'మేముసైతం' అంటూ కర్ణాటకలోని క్రైస్తవులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వంత్​ నారాయణ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తిరిగి చేరతాం

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘంలో తిరిగి చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ నిర్ణయం తీసుకున్నారు. ఐరాసలో కీలక మార్పులను కోరిన అగ్రదేశం.. అవి కార్యరూపం దాల్చకపోవడం వల్ల మూడేళ్ల కిందట వైదొలిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్చ్.. బ్యాడ్​లక్

చెన్నై టెస్టులో తాను ఔట్​ అయిన విధానంపై భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​ ఛెతేశ్వర్​ పుజారా స్పందించాడు. అద్భుతంగా బ్యాటింగ్​ చేసినప్పటికీ.. దురదృష్టం తనను వెంటాడిందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సూర్యకు కరోనా పాజిటివ్

ప్రముఖ హీరో సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details