తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @9AM

By

Published : Jan 19, 2021, 9:00 AM IST

  • కాళేశ్వరానికి కేసీఆర్..

మేడిగడ్డ ఆనకట్ట పరిశీలన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం వెళ్లనున్నారు. ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం లక్ష్మీ ఆనకట్ట, పరిసర ప్రాంతాలను సీఎం సందర్శిస్తారు. ఇంజినీర్లు, అధికారులతో ఆనకట్ట వద్దే సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి... వారికి దిశానిర్దేశం చేస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాలు

రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • సీబీఐ సోదాలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పీఎఫ్​ ప్రాంతీయ కార్యాలయంపై సీబీఐ దాడులు చేసింది. సీనియర్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ భరత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

'భూ పంచాయితీ'..

'మారము.. ఇక ఎన్నటికీ మారము' అనేలా వ్యవహారిస్తున్నారు కొందరు రెవెన్యూ అధికారులు. వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు... ఆ అధికారుల చర్యలతో నీరుగారిపోతున్నాయి. సామాన్యులే కాదు... జిల్లాస్థాయి అధికారులైనా తమ బాధితులే అన్నట్లుగా ప్రవరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు

గుజరాత్‌లోని సూరత్ కొసంబాలో పగలంతా కష్టించి ఆదమరచి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పాలిట ఓ ట్రక్కు మృత్యుశకటంలా మారింది. స్టీరింగ్​ వీల్​పై పట్టు కోల్పోయిన డ్రైవర్​.. ట్రక్కును పుట్‌పాత్‌పైకి తోలటంతో 15 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మహిళల నేతృత్వంలో..

మహిళా రైతుల దినోత్సవం పేరుతో.. సాగు చట్టాల రద్దుపై ఉద్యమిస్తున్న రైతులకు నేతృత్వం వహించారు మహిళలు. ఈ నేపథ్యంలో సంబంధిత అన్ని పనులనూ వారే చూసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వ్యూహకర్తలు వీరే

కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్​పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రమిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఈ బడ్జెట్​పై కేంద్ర మంత్రికి సహకారం అందిస్తున్న కార్యదర్శులు, సలహాదార్ల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎందుకింత ఆలస్యం?

క్యాపిటల్ ఉదంతం తరువాత అగ్రరాజ్య ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి వచ్చిన ప్రశ్న.. అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఎందుకింత సమయం? జనవరి 20 వరకు ఎందుకు ఆగాలి?. మరి అమెరికా రాజ్యంగంలో ఉన్న ఈ నిబంధనను ఓ సారి పరిశీలిస్తే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విజయానికి చిహ్నంగా

కరోనా కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ కచ్చితంగా జరుగుతాయని జపాన్​ ప్రధాన మంత్రి యోషిండే సుగా స్పష్టం చేశారు. వైరస్​పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్​​ నిర్వహణే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బాబాయ్​-అబ్బాయ్​లతో మల్టీస్టారర్​!

టాలీవుడ్​లో భారీ మల్టీస్టారర్​ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కోలీవుడ్​ దర్శకుడు శంకర్​ దీనికి దర్శకత్వం వహించనున్నరని సమాచారం. ఇందులో రామ్​చరణ్​, పవన్​ కల్యాణ్​ కలిసి నటించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details