- ఎన్టీఆర్‌కు భారతరత్న సాధిస్తాం
ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దేశవ్యాప్తంగా కొత్తగా 13,788 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 5 లక్షల 70 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,872 మంది కొవిడ్ బాధితులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- డిజిటల్ డోర్ నంబరింగ్..
‘‘గొప్ప హైదరాబాదీ చిరునామాలు..!! క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ తీసుకొచ్చేందుకు మేం ప్రణాళిక రూపొందిస్తున్నాం..’’ అంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి చేసిన ట్వీట్.. డిజిటల్ డోర్ నంబరింగ్ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బస్సు బోల్తా - ఒకరు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది పర్యటకులతో భువనేశ్వర్ వెళ్తున్న టూరిస్ట్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన గజపతి జిల్లా అదబా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంబులా చౌక్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- పట్టాలు తప్పిన షహీద్ ఎక్స్‌ప్రెస్
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. అమృత్సర్ నుంచి జైనగర్ వెళ్తున్న షహీద్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రెండు బోగీలు రైలు నుంచి విడిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు బోగీల్లో మొత్తం 155మంది ప్రయాణికులున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కరోనా కారణంగా చిల్లర వర్తక రంగం కోలుకోలేని విధంగా నష్టపోయిందన్నది కాదనలేని సత్యం. ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తే దేశ ఆర్థికవ్యవస్థకు జవసత్వాలు తీసుకొచ్చే సత్తా ఈ రంగం సొంతం అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. దేశ ప్రగతి రథంతో పాటు సామాన్యుడి జీవన చక్రం సాఫీగా సాగేందుకు వచ్చే బడ్జెట్లో ఈ రంగానికి కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రష్యా ప్రతిపక్ష నేత అరెస్టు
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావెల్నీని ఆ దేశ పోలీసులు అరెస్టు చేయడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. నావెల్నీని వెంటనే విడుదల చేయాలని అమెరికా, ఐరోపా సమాఖ్యలు డిమాండ్ చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- భారత మాజీ క్రికెటర్‌కు అస్వస్థత
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ మాజీ లెగ్‌స్పిన్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. 'లైగర్' అనే టైటిల్‌గా ఖరారు చేయగా.. 'సాలా క్రాస్బ్రీడెడ్' అనేది ఉపశీర్షిక. ఫస్ట్‌లుక్‌లో బాక్సర్‌గా విజయ్ ఫోజులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి