తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్ న్యూస్ @ 11AM - top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 11AM
టాప్ న్యూస్ @ 11AM

By

Published : Jan 31, 2022, 11:00 AM IST

  • పార్లమెంట్​లో రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగింస్తున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం కానుంది.

  • ఈసారైనా రాష్ట్ర రైల్వే ప్రగతి పట్టాలెక్కేనా..?

ఈ బడ్జెట్​లో రైల్వే కేటాయింపులపై రాష్ట్ర డిమాండ్లు ఏవిధంగా ఉన్నాయి..? రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లు వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..? చివరి ప్రయత్నంగా రాష్ట్ర ఎంపీలు ఈ సారైనా గట్టి ప్రయత్నం చేస్తారా..? ఈ సంవత్సరమైనా.. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇస్తుందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • మాజీ ఐపీఎస్ ఇంటి బేస్​మెంట్​లో 650 లాకర్లు!

ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి బేస్​మెంట్​లో భారీగా నగదును గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. బేస్​మెంట్ నుంచే ఓ కంపెనీని నడిపిస్తున్నట్లు కనుగొన్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు 650 లాకర్లు ఉన్నాయని వెల్లడించాయి.

  • దేశంలో ఆందోళనకరంగా కరోనా మరణాలు

భారత్​లో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం మరో 2,09,918 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 959 మంది మరణించారు. 2,62,628 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • దేదీప్యమానం.. సమతామూర్తి దివ్యక్షేత్రం

తన కళతో యాదాద్రికి పునర్వైభవం తీసుకువచ్చిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. ముచ్చింతల్​లో దేదీప్యమానంగా రూపుదిద్దుకుంటున్న సమతామూర్తి దివ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలో తనకు విద్యుత్ దీపాలంకరణ పనులను అప్పగించినట్లు తెలిపారు. ఇక్కడి పనులను చూసే తనకు యాదాద్రి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పారు.

  • 'కిమ్' క్షిపణి.. టార్గెట్ అమెరికా!

ఆదివారం ప్రయోగించిన శక్తిమంతమైన క్షిపణి తాలూకు చిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేసింది. రెండు వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన చిత్రాలను షేర్ చేసింది. ఈ మిసైల్​కు అమెరికా భూభాగాన్ని ఢీకొట్టే సత్తా ఉందని చెప్పుకొచ్చింది.

  • ఆ దేశ అధ్యక్షుడే టార్గెట్‌గా యూఏఈపై దాడులు

యెమెన్​ హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి యూఏఈపై విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున క్షిపణి దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ యూఏఈ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ దాడులు మరింత ఉద్రిక్తతలకు దారితీశాయి.

  • ఐపీఎల్​ కోసం బాగా శ్రమిస్తున్నా

టీ20 వరల్డ్​కప్​లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్​ఇండియాకు విజయాన్ని అందించడమే తన లక్ష్యమని చెప్పాడు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ఈ మెగాటోర్నీకి ముందు ఐపీఎల్​, తనకు ట్రైనింగ్​ ప్లాట్​ఫామ్​లా బాగా ఉపయోగపడుతుందని అన్నాడు.

  • విండీస్​దే సిరీస్​​

ఇంగ్లాండ్​తో నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​ ఆఖరి ఓవర్​లోని నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు విండీస్​ బౌలర్​ జేసన్​ హోల్డర్​.

  • 'ఖిలాడి'లో అనసూయ డబుల్ ధమాకా!

నటిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న అనసూయ.. రవితేజ 'ఖిలాడి'లో రెండు క్రేజీ రోల్స్​లో నటించిందట.

ABOUT THE AUTHOR

...view details