నాపై దాడికి కుట్ర
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు (sectional comments) చేశారు. తనపై దాడికి కుట్ర పన్నారని.. ఈ విషయం మాజీ నక్సలైట్ (former Naxalite) సమాచారం ఇచ్చినట్లు శనిగరంలో వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పెట్టుబడులకు అనుకూలం
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో హైదరాబాద్‌లో మరిన్ని నూతన పెట్టుబడులు రావాల్సి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతల వల్ల ఈ రంగాల్లో ఇప్పటికే లక్షా 80 వేల మందికి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ కార్యాలయాన్ని కేటీఆర్ రాయదుర్గంలో ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వారి వేతనాలు పెరిగాయి
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి రూ. 28,719కి పెంపు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
21 కోట్ల హెరాయిన్ పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో మత్తుపదార్థాల రవాణా ఆగడం లేదు. నిఘా సంస్థల కళ్లుగప్పేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ... అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేక పట్టుబడుతున్నారు. తాజాగా విమాశ్రయంలో ఓ మహిళ నుంచి 3.2 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తొలిరోజే దుమారం
చమురు ధరలు, కరోనా సంక్షోభం, ఇతర అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయసభలు హోరెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలగా.. లోక్‌సభ, రాజ్యసభ ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.