జాబ్ క్యాలెండర్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ను రూపొందించాలని కేబినెట్ ఆదేశించింది. ఏటా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని పేర్కొంది. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.
పెంపునకు రంగం సిద్ధం
రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. కసరత్తు పూర్తి చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. మంత్రివర్గం నుంచి అనుమతి రాగానే అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.
తెరాసకు అభ్యర్థే లేరు.!
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాసకు అభ్యర్థి కరవయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీ, సహాయ ఇంఛార్జీలతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.
కాంగ్రెస్‌లోకి వలసలు
రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.
మరో ఆడియో లీక్... అందులో ఏముందంటే!
ఒక్క ఫోన్‌కాల్‌తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హుజూరాబాద్‌కు చెందిన నాయకుడు కౌశిక్ రెడ్డి.. మరో ఆడియో లీకయింది. తాను ఏ తప్పు చేయలేదని.. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏం చెయ్యాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు. ఈ ఆడియో బయటకొచ్చింది. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.
'వేరియంట్లపై ఓ కన్నేయండి'
కరోనా కట్టడికి క్షేత్ర స్థాయిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితిపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు.