23న విచారణ
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించాలని మరోసారి జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'రేవంత్ ఫైర్'
పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో చేపట్టిన నిరసన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, కేసీఆర్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని రేవంత్ విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కౌశిక్‌రెడ్డి రాజీనామా
హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు పీసీసీ కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి తన రాజీనామా పత్రాన్ని పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'పెట్రో' మంటపై కాంగ్రెస్ పోరు
చమురు ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎడ్లబండ్లు, సైకిళ్లతో ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంచి.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కారెక్కిన రమణ
తెలంగాణ తెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. రమణకు తెరాస సభ్యత్వం ఇచ్చారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ జిల్లాల పేర్లు మార్పు
వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రతిపాదించారు.