తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

By

Published : Jul 11, 2021, 8:58 PM IST

గోల్కొండ తల్లికి తొలి బోనం

ఊరూవాడా అంతా కలిసి సంబురంగా జరుపుకునే బోనాల పండుగు ఇవాళే షురూ అయింది. ప్రతిఏడులాగే ఈ ఏడు ఈ ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమయ్యాయి. భక్తులు.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కరోనా నిబంధనలు పాటించేలా చూస్తూ.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ముహూర్తం ఖరారు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ రేపు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్​లో తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ తెరాస ప్రాథమిక సభ్యత్వం స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నా దృష్టిలో చాలా చిన్న పదవి

తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంపై ప్రభావమెంత?

ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

థర్డ్‌వేవ్‌ సంకేతాలు

జనాల్లో మార్పు రాలేదు. రెండో దశలో(Covid second wave) చూసిన అత్యంత భయానక దృశ్యాలు మర్చిపోయారు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్​నాట్ విలువను గమనిస్తే.. థర్డ్​వేవ్(Third wave) సంకేతాలు కనిపిస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వారిని నామినేట్​ చేయండి'

అసాధారణ పనితీరు కనబరుస్తూ, ఎవరికీ తెలియకుండా సాధారణంగా ఉండేవారిని పద్మ అవార్డులకు నామినేట్​ చేయాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఇదే సరైన సమయం'

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగవ్వొచ్చని నీతి ఆయోగ్(Niti Aayog ) అంచనా వేసింది. దీనితో 2021-22లో రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భారత కాన్సులేట్‌ మూసివేత!

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్​ నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు(Taliban) పట్టుబిగించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక

అంతరిక్ష పర్యటన కోసం రిచర్డ్ బ్రాన్సన్.. న్యూమెక్సికోలోని స్పేస్​పోర్ట్​కు చేరుకున్నారు. సైకిల్​పైనే ఈ కేంద్రానికి విచ్చేశారు రిచర్డ్. అంతకుముందు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్​ మస్క్​ను కలిశారు. రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు సంతతికి చెందిన బండ్ల శిరీష సహా ఆరుగురు కలిసి రోదసిలోకి వెళ్లనున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సమీర్​ సాధించాడు

వింబుల్డన్( Wimbledon) బాలుర విభాగం ఫైనల్​లో ఇండో అమెరికన్​ సమీర్ బెనర్జీ(Samir Banerjee) టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో విక్టర్ లిలోవ్‌పై 7-5, 6-3తో బెనర్జీ విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details