మోదీ టీం ఇదే..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పలువురికి పదోన్నతి కల్పించగా.. కొంత మంది కొత్తవారికి చోటు కల్పించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో మొత్తం 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సామాన్య కార్యకర్త నుంచి..!
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి మంత్రివర్గ విస్తరణలో కిషన్‌రెడ్డికి పదోన్నతి దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సమష్టి పోరాటంతోనే అధికారం'
అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు నూతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
షర్మిల షెడ్యూల్ ఇదే..
వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. షర్మిల షెడ్యూల్ సైతం ఖారారైంది. వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం హైదరాబాద్‌కు చేరుకుని పార్టీని ప్రకటించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేటీఆర్ లేఖ
కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.