కేసీఆర్ సమీక్ష...
నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం'
పార్టీ సీనియర్లతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కార్మికురాలితోనే ప్రారంభం
హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ఈ వంతెనను ప్రారంభించడమే తరువాయి... కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ మంత్రి కేటీఆర్... వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికురాలు శివమ్మతో ఫ్లైఓవర్‌ను దగ్గరుండి ప్రారంభింపజేశారు. తనతో ఫ్లైఓవర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని కార్మికురాలు శివమ్మ సంతోషం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వంతెన కూలి ఇద్దరు మృతి
ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లి వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్ కూలి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దత్తాత్రేయ బదిలీ
కేంద్ర కేబినెట్ పునర్విభజన వార్తల నేపథ్యంలో కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించటం సహా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.