'వాటితో ఏదైనా సాధ్యమే'
"చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే... ఎవరెన్ని మాట్లాడినా... కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోంది. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం దిశగా పోతున్నాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కృష్ణాబోర్డుకు లేఖ
తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
' రాష్ట్రానిది అవగాహనా రాహిత్యం'
కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెరాస నేతలు కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'అంతకంటే పనులేమున్నాయి'
కృష్ణా జలాలను కాపాడటం కంటే సీఎం కేసీఆర్‌కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ రేవంత్‌రెడ్డి నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో 203 ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని తెలిపారు. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్ సంతకం పెట్టారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'తెరాసకు బుద్ధిచెప్పాలి'
కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రాష్ట్రవ్యాప్తంగా మహాపాదయాత్ర చేపడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BANDI SANJAY) తెలిపారు. హుజూరాబాద్‌లో తెరాసను ఓడించి, ఈటలను (Etela) గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.