అధికారులతో సీఎం రివ్యూ
ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య వారం రోజులుగా నడుస్తున్న జలవివాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సిరిసిల్లకు సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో కలియ తిరిగారు. ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఊరుకునేది లేదు'
ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జలవనరుల విషయంలో చుక్క నీరు నష్టపోకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎవరైనా తెలంగాణ వారే.!
రాష్ట్రంలో ఉన్నవారు ఎవరైనా సరే.. వారు తెలంగాణ పౌరులేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెటిలర్లను బెదిరింపు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే వారికి కచ్చితంగా అండగా ఉంటానని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
హైకోర్టులో ఎంపీ రఘురామ పిల్
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో నరసపూరం ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిల్ వేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.