- ద్విముఖ వ్యూహం కావాలి..
కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలుచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. కరోనా పరీక్షలను మరింతగా పెంచాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3,043 కరోనా కేసులు..
రాష్ట్రంలో కొత్తగా మరో 3,043 కరోనా కేసులు, 21 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 4,693 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పకడ్బందీగా లాక్‌డౌన్..
రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతోంది. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మే నెల సాయం విడుదల..
ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. మే నెలకు 2,04,743 మందికి రూ.40.94 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తెరిచే వరకూ రూ. 2వేల సాయం, ఉచితబియ్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భేటీ వాయిదా..
రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న ఆంధ్రప్రదేశ్ సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముంచుకొస్తున్న ముప్పు..