- పాకిస్థాన్‌పై తీవ్ర నిరసన..
పాక్.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్. పండుగ వాతావరణం వేళ ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడాన్ని ఖండించింది. ఈ మేరకు ఆ దేశ హై కమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపింది విదేశాంగ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 43వ వసంతంలోకి..
దక్షిణాది రాష్ట్రాలకు వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 42 ఏళ్లు పూర్తిచేసుకొంది. మహారత్నగా కీర్తిగడించి.. నేడు 43 వసంతంలోకి అడుగుపెట్టింది. దక్షిణాది వెలుగురేఖ రామగుండం ఎన్టీపీసీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కబ్జాకోరల్లో ఖానాపూర్ చెరువు..
కబ్జాదారుల ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యం... ఖానాపూర్ చెరువు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వందకుపైగా ఎకరాల విస్తీర్ణంతో ఆయకట్టు అన్నదాతలకు సాగునీరందించిన తటాకం.. నేడు కుచించుకుపోయి మనుగడకే ముప్పు వాటిల్లే స్థితికి చేరుకుంది. వందలాది మత్స్యకారులకు జీవనోపాధిగా నిలిచిన జలాశయం.. చెత్తచెదారం, గుర్రపుడెక్క పేరుకుపోయి ప్రమాదకరంగా పరిణమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దీపావళి' పండుగ పేరు మాత్రమే కాదు..
దీపావళి అంటే అందరికి పండుగ అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం తమ ఊరు గుర్తుకు వస్తుంది. దీపావళి పండగ పేరుతో ఏకంగా ఓ గ్రామం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో లేదండోయ్. ఏపీ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. అసలు ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి..!