తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM

By

Published : Jul 8, 2021, 8:59 AM IST

  • కుమార్తెలకు ఉరేసి తల్లి బలవన్మరణం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రాంనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు కుమార్తెలకు ఉరేసి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. మృతులు తల్లి ఉమారాణి(31), హర్షిణి(13), లక్కీ(11)గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేబినెట్, మంత్రిమండలి భేటీ!

కేబినెట్​, కేంద్ర మంత్రి మండలితో గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశముంది. మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగిన సందర్భంగా ఈ భేటీలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేడే పార్టీ ప్రకటన..

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోంది. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్​ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్​ షర్మిల.. ఇవాళ తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను ఇవాళ సాయంత్రం వెల్లడించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆన్​లైన్​ సేవలకు అంతరాయం..

రేపు రాత్రి 9 గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు వెబ్​సైట్​లు, ఆన్​లైన్​ సేవలకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాకెట్​ దాడులు..

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్​ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్​ ఆర్మీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏకధాటిగా కురిసిన వర్షం..

రాష్ట్రంలో వివిధ చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో భారీగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుకు ఓ బాలిక మృతి చెందింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇడుపులపాయలో జగన్ పర్యటన..

దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి(CM JAGAN TOUR) నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్​ఆర్​ ఘాట్​లో నివాళులర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆందోళనకరంగా డ్రోన్ల జోరు..

కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం వల్ల స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్లడం కొంత తగ్గింది. ఫలితంగా పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. చైనా కూడా భారత స్థావరాలపైన భారీ ఎత్తున డ్రోన్లను మోహరించింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విజయాల సారథి..

సౌరవ్​ గంగూలీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో విజయాలు సాధించింది. భారత జట్టును ముందుండి నడిపించి.. క్రికెట్​ ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దాదా ఎంతో కృషి చేశాడు. గురువారం (జులై 8) ఆయన పుట్టినరోజు సందర్భంగా గంగూలీ సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • థియేటర్లకే తెలుగు హీరోల మద్దతు..

సినీ పరిశ్రమ భవిష్యత్​ థియేటర్లేనని అభిప్రాయపడ్డారు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు మురళీ మోహన్​. కరోనా కారణంగా అంతరించిపోతున్న థియేటర్లను కాపాడేందుకు నిర్మాతలు ముందుడుగు వేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు వరకు సినిమాలను ఓటీటీలకు అమ్మకుండా వేచిఉండాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details