- తీవ్రమవుతున్న 'యాస్'..
యాస్ తుపాను క్రమంగా బలపడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు కోల్‌కతాలోని శామాప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా నిలిచిన వాహనాలు..
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్..
రెండో విడతలో దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో సాధారణ అంబులెన్సులే కాదు...ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్యం క్లిష్టతరంగా మారిన రోగులను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించడానికి ఎయిర్ అంబులెన్సులను వాడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పిల్లలకూ టీకా!
దేశంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్ టీకా వేస్తున్నారని.. వైరస్‌లో వేరియంట్లు మారుతున్న కొద్దీ పిల్లలపై ప్రభావం పెరుగుతోందని ప్రఖ్యాత టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డా.రేచస్ ఎల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి పిల్లల మీద టీకా పరీక్షలు (పీడియాట్రిక్ ట్రయల్స్) మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీలో పకడ్బందీగా..
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండగా.. పోలీసులు కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కరోనా రోగుల కోసం దాతలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు కోసం రాష్ట్రానికి మరో 4 లక్షల 44 వేల కొవిషీల్డ్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ ఫంగస్ కేసులూ అధికంగానే నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుపాను సన్నద్ధతపై మోదీ సమీక్ష..