తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM

By

Published : May 22, 2021, 9:00 AM IST

  • నిర్లక్ష్యం వద్దు..

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు కావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత డీజీపీ సహా కలెక్టర్లపై ఉందని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నేడు ఉత్తర్వులు!

రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలకు నూతన వీసీలు రానున్నారు. ప్రభుత్వం పంపిన దస్త్రానికి గవర్నర్​ ఆమోదం తెలిపారు. వారి నియమక ఉత్తర్వులు ఇవాళ వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మంత్రి కేటీఆర్ చేయూత..

కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ భార్యాభర్తలిద్దరికి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఉద్యోగం కల్పించారు. సికింద్రాబాద్​ చిలకలగూడ చౌరస్తా కల్వర్టు కింద తలదాచుకుంటున్న ఈ దంపతుల పరిస్థితి చూసిన ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. వారికి జీవనోపాధి కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు..

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. నమ్మి మనసిచ్చింది. అన్నీ అతనే అనుకుంది. కానీ ఆమె వేరే అబ్బాయితో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు ఆ అబ్బాయి. పథకం ప్రకారం ప్రియురాలుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టాడు. అనంతరం అదే సీసాతో గొంతు కోసి చంపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నోరెత్తితే కేసులు.. ప్రశ్నిస్తే సంకెళ్లు..!

ఏపీలో తెదేపా శాసనసభాపక్షం నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రశ్నోత్తరాల్లో భాగంగా.. ఎన్నికల హామీల అమల్లో వైకాపా వైఫల్యంపై నేతలు చర్చించారు. అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ గాలికి వదిలేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కుక్కల్లో కొత్త రకం కరోనా..

కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడినట్లు మలేసియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు చెందిన పత్రాలు క్లినికల్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇది వ్యాధికారకమని గుర్తిస్తే జంతువుల నుంచి మనుషులకు సోకే ఎనిమిదో వైరస్‌ అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సీరం' మండిపాటు..

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) తీవ్ర స్థాయిలో మండిపడింది. అందుబాటులో ఉన్న టీకా నిల్వల వివరాలు తెలియకుండానే.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి కేంద్రం వ్యాక్సినేషన్​ ప్రారంభించిందని ఆ సంస్థ కార్యనిర్వహక డైరెక్టర్​ విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్‌ టీకా ఖర్చు ఎంతంటే..

దేశంలోని 20 ప్రధాన రాష్ట్రాల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రూ.3.7 లక్షల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. అయితే ఇటీవల లాక్​డౌన్​తో వాటిల్లిన ఆర్థిక నష్టం కంటే ఇది తక్కువేనని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫీల్డింగ్ చాలా మెరుగవ్వాలి..

టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు ఫీల్డింగ్​లో చాలా మెరుగవ్వాల్సి ఉందని తెలిపాడు ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ. ఆటలో మార్పునకు అనుగుణంగా ఆటగాళ్లు దృఢంగా, చురుగ్గా ఉండాలని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మైదాన్' రిలీజ్​పై నిర్మాతల క్లారిటీ..

బాలీవుడ్​ నటుడు అజయ్​ దేవగణ్​ నటిస్తున్న 'మైదాన్'​ సినిమా ఓటీటీ వేదికగా పే పర్​ వ్యూ పద్ధతిలో విడుదల కానున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తమని స్పష్టం చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేయడంపైనే తాము దృష్టి సారించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details