తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @9AM - top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @9AM
టాప్​టెన్​ న్యూస్ @9AM

By

Published : May 18, 2021, 9:00 AM IST

  • తీరం దాటిన తౌక్టే..

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన అతి తీవ్ర తుపాను తౌక్టే.. గుజరాత్‌లో తీరం దాటింది. ఈ సమయంలో కురిసిన భారీ వర్షాలు గుజరాత్‌, మహారాష్ట్రలో అపారనష్టం కలిగించాయి. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా.. పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. తుపాను ధాటికి 14 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హైదరాబాద్​లో వర్షం..

తౌక్టే తుపాను ప్రభావంతో హైదరాబాద్​ నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. వర్షం కారణంగా విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 6 జిల్లాల్లో వైద్య కళాశాలలు..

రాష్ట్రంలో కొత్తగా ఆరు వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలనూ ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యరంగానికి ఊతమివ్వడంతో పాటు పేద విద్యార్థులకు వైద్యవిద్యను ఉచితంగా అందించేందుకు వెసులుబాటు కలగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేటీఆర్​కు దిల్లీ డాక్టర్ ట్వీట్​​..

టొసిలిజుమాబ్ కరోనా తీవ్రంగా ఉన్నవారికే వినియోగిస్తారని.. బ్లాక్​ ఫంగస్ కోసం కాదని మంత్రి కేటీఆర్​కు గురుగావ్​కు చెందిన వైద్యనిపుణుడు అర్విందర్ సింగ్​ తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఏమి ఉపయోగించాలని మంత్రి అడగ్గా అంఫోటెరిసిన్‌, పొసకానాజోల్‌ ఔషధాలను సొయిన్‌ సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం..

కొవిడ్​ నుంచి కోలుకున్నవారికి.. బ్లాక్​ ఫంగస్ మరో ముప్పుగా మారుతోంది. దేశంలో ప్రస్తుతం ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతువుతున్నాయి. రాష్ట్రంలోనూ మ్యూకర్​మైకోసిస్ బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఫంగస్​ బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయండి..

కరోనా బాధితులకు చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సూచించింది. తద్వారా బాధితులకు సత్వర వైద్యం సమీపంలోనే అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఉపాధి' పనులకు ఆదరణ..

కరోనా రెండో దశ, లాక్​డౌన్​ కారణంగా పల్లెల్లో ఉపాధి హామీ పనులకు డిమాండ్​ పెరిగిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. మేలో ఇప్పటిదాకా 1.85 కోట్ల పల్లె ప్రజలు ఈ పనులను ఉపయోగించుకున్నారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దావోస్ సదస్సు రద్దు..

స్విట్జర్లాండ్​లోని దావోస్​లో జరగాల్సిన వార్షిక సదస్సు కొవిడ్​-19 వ్యాప్తి దృష్ట్యా రద్దైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వాహకులు ఈ మేరకు ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • త్వరలోనే వాళ్లను అందుకుంటా..

నాలుగేళ్లుగా గ్రాండ్​స్లామ్ టైటిల్ గెలవడంలో విఫలమవుతున్నాడు టెన్నిస్ స్టార్ ఫెదరర్. మోకాలి గాయం కారణంగా ఏడాదికి పైగా విరామం తీసుకుని ఇటీవలే కోర్టులో అడుగుపెట్టాడు. యువ ఆటగాళ్లతో పాటు నాదల్, జకోవిచ్​ మంచి ఫామ్​లో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఫెదరర్​ త్వరలోనే తాను వీళ్లందరి స్థాయిని అందుకోగలనని ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇప్పుడు ఆ జ్ఞాపకం నా దగ్గర లేదు..

సోనూసూద్‌ తొలినాళ్లలో ఒక కామిక్‌ షో కోసం పోషించిన 'నాగరాజ్'​ పాత్ర ఈ మధ్య వైరల్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆ పాత్రలో తనను తాను చూసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పారు. అలాగే దానికి సంబంధించిన ఓ జ్ఞాపకం తన దగ్గర లేదని చింతిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details