తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@9AM
టాప్​టెన్​ న్యూస్​ @9AM

By

Published : May 16, 2021, 8:57 AM IST

  • అప్రమత్తమైన ప్రభుత్వం...

రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు చికిత్స అందించేందుకు కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ సమయంలోనే బ్లాక్‌ ఫంగస్‌ సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోటా పెంపు...

ముఖ్యమంత్రి కేసీఆర్​ వినతి మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రెమ్​డెసివర్​, ఆక్సిజన్​ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోలుకున్నా వదలట్లేదా?...

కరోనా చికిత్స అనంతరం కొందరిలో ఉన్నట్టుండి మెదడు, గుండె, ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్టెరాయిడ్స్‌ వాడినవారి రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వారికే ముప్పు...

కరోనా తదనంతరం వచ్చే ఆరోగ్య సమస్యల్లో బ్లాక్ ఫంగస్ ఒకటి. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకే పరిమితమైన ఈ బ్లాక్ ఫంగస్.. మరణాలు మన రాష్ట్రంలోనూ నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గుజరాత్​ దిశగా..

తౌక్టే తుపాను.. గుజరాత్​ దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న పోర్‌బందర్‌- నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది. గోవా, కొంకణ్‌, మహారాష్ట్రపై తుపాను ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏ రాష్ట్రాల్లో ఎలా?...

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. బంగాల్​లో ఆదివారం నుంచి మే 30 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిర్లక్ష్యం వల్లే కరోనా వ్యాప్తి...

కరోనా మహమ్మారి మొదటి దశ తర్వాత ప్రభుత్వం, ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పెట్రో మోత...

దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. చమురు ధరలను పెంచుతూ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్​పై 24పైసలు, లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​ ప్రారంభమైతే...

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​.. తిరిగి ప్రారంభమైతే ఆడటానికి తాను సిద్ధమని తెలిపాడు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. లీగ్​లో రాజస్థాన్​ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్​.. వేలి గాయం కారణంగా ఈ సీజన్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఆ సినిమా 267సార్లు చూశా!'...

మ్రాన్‌ హష్మితో కలిసి నటించిన 'వై చీట్‌ ఇండియా' సినిమాతో బాలీవుడ్​ అరంగేట్రం చేసింది ఆ తెలుగమ్మాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్‌', 'స్కామ్‌ 1992' సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె శ్రేయా ధన్వంతరి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details