తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@ 9AM

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

TOP TEN NEWS @ 9AM
TOP TEN NEWS @ 9AM

By

Published : Sep 22, 2020, 8:58 AM IST

త్వరలోనే ప్రారంభం...

క్రమబద్దీకరణ ప్రక్రియలో తదుపరి దశ త్వరలో ప్రారంభం కానుంది. నిషేధిత జాబితాలో ఉన్నవాటిని మొదట్లోనే గుర్తించి తిరస్కరించనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని దరఖాస్తుల పరిష్కార కార్యాచరణ చేపట్టనున్నారు. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ పోర్టల్ త్వరలోనే క్షేత్రస్థాయి అధికారులకు కూడా అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చినుకుకే వణుకు...

విశ్వనగరానికి తగ్గట్టుగా ప్రణాళికను అమలు చేయడంలో చిత్తశుద్ధి కరవవడం వల్ల నగరంలో చిన్న చినుకుకే వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ నాలా ఉందో ఎక్కడ రహదారి ఉందో తెలియని పరిస్థితి. అందుకే.. చాలామంది నాలాల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొద్దిపాటి వాన పడినా నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం అవి ఆక్రమణలకు గురి కావడమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బీకాంకే మొగ్గు...

రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో బీకాం కోర్సువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యాసంవత్సరం సీట్లు పొందిన వారిలో 37 శాతం మంది బీకాం వారే ఉండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రఫేల్​ చక్కర్లు...

భారత అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భావిస్తోన్న రఫేల్​ యుద్ధ విమానాలు లద్దాఖ్​లో చక్కర్లు కొట్టాయి. చైనా వాస్తవాధీన రేఖ వెంట ఎగురుతున్న ఈ విమానం వీడియోను విడుదల చేసింది రక్షణ శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జోన్లు, డివిజన్లు తగ్గిస్తారట...

భారత్​లో రైల్వేజోన్లు, డివిజన్ల సంఖ్యను తగ్గించే అంశం తమ పరిశీలనలో ఉందని రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు లోక్​సభలో లిఖితపూర్వకంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమధానం ఇచ్చారు​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

యువతపై కరోనా గురి...

కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య ఆందోళనకరంగా మారింది. యువకులు సైతం ఐసీయూలో చేరి చికిత్స పొందుతున్నట్లు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) నివేదిక స్పష్టీకరించింది. మనదేశంలోనే కాదు, ఐరోపాలోని అనేక ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మూడో దశ మొదలు...

ఆక్స్​ఫర్ఢ్​ అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్​ టీకా​ మూడోదశ ప్రయోగ పరీక్షలు భారత్​లో ప్రారంభమయ్యాయి. పుణెలోని ససూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రయోగ పరీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మొండి బ్యాంకు...

ఒక మొండి బకాయిల సమస్యలు పరిష్కరించేందుకు ఒక 'మొండి బ్యాంకు'ను ఏర్పాటు చేయాలన్నారు ఆర్​బీఐ మాజీ గవర్నర్​ రఘురామ్​ రాజన్. ప్రైవేటీకరణ, ఆర్థిక సేవల విభాగం, సంస్కరణలు సహా పలు విషయాలపై సర్కార్​కు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆర్సీబీ మార్పు ట్విట్టర్లోనేనా...

లాక్​డౌన్​ కాలంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టిన వారికి సంఘీభావంగా తమ జెర్సీలపై 'మై కొవిడ్​ హీరోస్​' అని ప్రదర్శించారు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆటగాళ్లు. అయితే ఈ మార్పు ట్విట్టర్​కే పరిమితమైందా... పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ అల్లుడు సంక్రాంతికే...

వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్​' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ చిత్రనిర్మాతలు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత సోమవారం ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details