- ఆగని ఉద్ధృతి..
రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి కొవిడ్ బాధితుల సంఖ్య 47,705కి చేరుకుంది. మహమ్మారి నుంచి కోలుకుని 2,062 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నుంచి 36,385 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా విలయం..
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలనూ చుట్టేసింది. కేసుల నమోదులో మరింత ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కోటీ 50 లక్షలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. 6.20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో మూడు నెలల్లో..
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆశాజనక ఫలితాలు సాధిస్తోన్న ఆక్స్ఫర్డ్ టీకా.. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్‌లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త సచివాలయం అలా ఉండాలి..
సచివాలయ కొత్త భవనం హుందాగా, పూర్తి సౌకర్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్‌ల నమూనాను పరిశీలించిన సీఎం... కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. సచివాలయానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏదడిగినా ఇవ్వండి..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం వల్ల వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనాపై వాస్తవాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న ‘కొవాక్జిన్’ ట్రయల్స్