- కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ డేటా విడుదల
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తుది డేటాను ఆ సంస్థ విడుదల చేసింది. కరోనాపై 77.80 శాతం సమర్థవంతంగా టీకా పని చేస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'న్యాయవ్యవస్థను రక్షించే బాధ్యత లాయర్లదే'
న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపేలా ఏవైనా దాడులు జరిగితే వాటి నుంచి రక్షణ కల్పించాల్సింది వారే అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రాజీనామా చేయటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జలజగడం తీవ్రం..
తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో కృష్ణా యాజమాన్యం బోర్డు రంగంలోకి దిగింది. ఈనెల 9న సమావేశం జరపాలని నిర్ణయించిన బోర్డు.. విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితిని కేంద్రం దృష్టికి యాజమాన్య బోర్డు తీసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉద్యోగ ప్రకటన లేదు.. వయసు దాటిపోతోంది..
డిగ్రీ పట్టా చేత పట్టుకుని.. ప్రభుత్వం చేసే ఉద్యోగాల ప్రకటన కోసం ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతుంది. సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసే లోపు కొందరికి వయో పరిమితి కూడా దాటిపోతోంది. ప్రభుత్వం ఉద్యోగం చేయాలన్న వారి ఆశలు అడిశయాలు అవుతుండగా... వారి భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం..